అమెరికా డెత్ వ్యాలీలో భూమ్మీదే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు!

- Advertisement -

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్‌వ్యాలీలో ఈ భూమ్మీదే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి జాతీయ పార్కులో ఆగస్టు 16న అత్యధికంగా 130 డిగ్రీల ఫారెన్‌హీట్ (54.4 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత నమోదైనట్టు అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

107 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. ఈ భూగ్రహం మీదే ఇది అత్యధిక ఉష్ణోగ్రతగా దీనిని భావిస్తున్నారు.

డెత్ వ్యాలీలో నమోదైన ఉష్ణోగ్రత రికార్డును పరిశీలిస్తున్నట్టు పరిశీలిస్తున్నట్టు ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంవో తెలిపింది.

ఈ రికార్డు కనుక నిర్ధారణ అయితే 1913 తర్వాత ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కానుంది. సముద్ర మట్టానికి 193 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన పరికరంపై ఉష్ణోగ్రత నమోదైనట్టు లాస్‌వెగాస్ వాతావరణ కేంద్రం తెలిపింది.

10 జులై 1913న 134 డిగ్రీల ఫారెన్‌హీట్ అత్యధిక ఉష్ణోగ్రత అమెరికాలోనే నమోదైంది. ఆ తర్వాత అదే సమయంలో రెండుసార్లు 130 డిగ్రీల ఫారెన్‌హీట్ దాటింది.

2013లో కొంచెం తగ్గి 129.2 డిగ్రీల ఫారెన్‌హీట్ నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు 130 డిగ్రీల ఫారెన్‌హీట్ నమోదైంది.

- Advertisement -