
హైదరాబాద్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎల్ఐసీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. డిగ్రీ అర్హతతో దేశవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలోని డివిజన్లలో ఖాళీలు ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగ వివరాలు
పోస్టు: అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీఓ)
మొత్తం ఖాళీలు: 8581
జోన్లవారీ ఖాళీలు: సెంట్రల్ (భోపాల్)-525, ఈస్టర్న్ (కోల్‌కతా)-922, ఈస్ట్ సెంట్రల్ (పట్నా)-701, నార్తర్న్ (న్యూదిల్లీ)-1130, నార్త్ సెంట్రల్ (కాన్పూర్)-1042, సదరన్ (చెన్నై)-1257, సౌత్ సెంట్రల్ (హైదరాబాద్)-1251, వెస్టర్న్ (ముంబయి)-1753.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.05.2019 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ప్రిలిమినరీ పరీక్ష తేది: జులై 6, 13
మెయిన్స్ ఎగ్జామ్ తేది: ఆగస్టు 10
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: జూన్ 9
పూర్తి వివరాలకు
వెబ్‌సైట్: https://www.licindia.in/








