నిరుద్యోగులకు మంచి అవకాశం…ఇండియన్ నేవీలో పీసీ, ఎస్‌ఎస్‌సి ఉద్యోగాలు….

- Advertisement -

ఢిల్లీ: ఇండియ‌న్ నేవీ.. నిరుద్యోగులకు మంచి శుభవార్త చెప్పింది. నేవీలో వివిధ బ్రాంచుల్లోని ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ (పీసీ), షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అవివాహిత పురుషులు, మ‌హిళ‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు……

మొత్తం ఖాళీలు: 121(ఎగ్జిక్యూటివ్ (ఎస్ఎస్‌సీ)-55, టెక్నిక‌ల్(ఎస్ఎస్‌సీ)-48, ఎడ్యుకేష‌న్ (పీసీ)-18)

శిక్ష‌ణ కేంద్రం: ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ (ఐఎన్ఏ), ఎజిమ‌ళ‌, కేర‌ళ‌.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ, బీఎస్సీ, బీకాం బీఎస్సీ (ఐటీ), పీజీ డిప్లొమా/ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ (ఐటీ), డీజీసీఏ జారీ చేసిన క‌మ‌ర్షియ‌ల్ పైల‌ట్ లైసెన్స్‌.

గమనిక: అభ్యర్ధులకు నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

ఎంపిక‌: ఇండియ‌న్ నేవీ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఐఎన్ఈటీ), ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ప‌రీక్ష తేది: ఆగ‌స్టు 2019

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.205

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 18.05.2019, ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 29.05.2019

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

చదవండి: నిరుద్యోగులకు శుభవార్త: కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు…
- Advertisement -