
ఢిల్లీ: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) లో ఖాళీలు ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగాల్లో మెకానికల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మైనింగ్ ఇంజనీరింగ్ పోస్టుల కోసం సెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
సంబంధిత బ్రాంచుల్లో డిగ్రీ పూర్తి చేసినవారు అర్హలుగా పేర్కొంది. గేట్ 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టు: మేనేజ్మెంట్ ట్రైనీ
మొత్తం ఖాళీలు: 142
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ.
వయసు: 14.06.2019 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: గేట్-2019 స్కోరు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: జూన్ 14
పూర్తి వివరాలకు
వెబ్సైట్: https://www.sailcareers.com/








