
ముంబై: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దూసుకుపోతున్న హువావే సంస్థ మరో నూతన స్మార్ట్‌ఫోన్ వై9 ప్రైమ్ 2019ను తాజాగా సౌదీ మార్కెట్‌లో విడుదల చేసింది.
త్వరలో ఈ ఫోన్ భారత్‌లో కూడా విడుదల కాబోతోంది. 4జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ రూ.18,170 ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది. అలాగే ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. మరి, అవేమిటో మీరూ ఓ లుక్కేయండి.
హువావే వై9 ప్రైమ్ 2019 ఫీచర్లు…
6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్
64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్
16, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్







