26.1 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి బాబు కి భయం పట్టుకుంది: రామచంద్రయ్య

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి బాబు కి భయం పట్టుకుంది: రామచంద్రయ్య

Chandrababu Naidu Varthalu, TDP Latest News, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీర్ణియించుకోలేకపోతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. కొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు తన ఓటమిని ఈవీఎంలపై నెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.

మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారమని ఆరోపించారు.

ఐదేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేశారని ప్రశ్నించారు. జాతీయ నేతలు పిలవకున్నా పక్క రాష్ట్రాలకు వెళ్తూ చంద్రబాబు మన రాష్ట్ర పరువు తీస్తున్నారని విమర్శించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చంద్రబాబుకు ప్రతికూలంగా రావడంతోనే వాటిపై నమ్మకం లేదంటున్నారని ఆరోపించారు.

సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం సిగ్గు చేటన్నారు. విపక్షాల సమావేశానికి చంద్రబాబును పూర్తిగా పక్కకు పెట్టారన్నారు. చంద్రబాబుకు దేశంలో ఎక్కడ విలువలేదని, ఎంత తిరిగిన ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హుందాతనాన్ని కోల్పోయి.. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

 
- Advertisement -