ఐటీఐ, ఇంటర్ అర్హతలతో బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు…

bsf recruitment
- Advertisement -

ఢిల్లీ: ఐటీఐ, ఇంటర్ అర్హతలు కలిగిన నిరుద్యోగులకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శుభవార్త చెప్పింది. క‌మ్యూనికేష‌న్ విభాగంలో ఖాళీలు ఉన్న హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి  ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఇందులో మొత్తం 1072 పోస్టులు ఉన్నాయి. ఇక వీటిలో 25శాతం ఖాళీల‌ను బీఎస్ఎఫ్‌లో ప‌నిచేస్తున్న అభ్య‌ర్థుల‌కు కేటాయించారు.

పోస్టులు:

హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆప‌రేట‌ర్‌): 300

హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్‌): 772

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 12.06.2019 నాటికి 18-25 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. గమనిక.. అన్నీ పోస్టులకు నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

రాత‌ప‌రీక్ష‌, పీఎస్‌టీ/ పీఈటీ, డాక్యుమెంటేష‌న్‌, డిస్క్రిప్టివ్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ఫీజు వచ్చి జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్య‌ర్థులకు రూ.100; ఎస్సీ, ఎస్టీ, మ‌హిళ‌లు, డిపార్ట్‌మెంట‌ల్ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభ తేదీ: 14.05.2019,
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 12.06.2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://bsf.nic.in/

- Advertisement -