24.8 C
Hyderabad
Friday, October 16, 2026
- Advertisement -
Home క్రైమ్ తిరుపతి హాస్టల్ బాగోతం: సూపరింటెండెంట్ అరెస్ట్, ‘‘అతడు నిర్దోషి.. అ అమ్మాయి ఓ లెస్బియన్’’ అంటూ...

తిరుపతి హాస్టల్ బాగోతం: సూపరింటెండెంట్ అరెస్ట్, ‘‘అతడు నిర్దోషి.. అ అమ్మాయి ఓ లెస్బియన్’’ అంటూ తోటి బాలికల నిరసన…

man cheated to minor girl with name of pretext of marraige
- Advertisement -

tirupati hostel student rape case Superintendent Nandakishor arrested

తిరుపతి: తిరుపతి బాలికల వసతి గృహం సూపరింటెండెంట్ కీచకపర్వం గురించి తెలిసిందే. ఆ వసతిగృహంలో ఉంటున్న ఓ బాలికపై అతడు నాలుగేళ్లుగా అత్యాచార పర్వం సాగిస్తుండడం, ఈ నేపథ్యంలో ఆ బాలిక గర్భవతి కావడం రాష్టంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన నందగోపాల్‌‌ను అరెస్ట్ చేశారు.

అంతేకాదు, 150 మంది బాలికలు ఉన్న ఈ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో సూపరింటెండ్‌గా పని చేసే నందగోపాల్ ఇక్కడ ఉండే అనాధ బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవాడని స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు కూడా ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో కడప జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్‌కు గురవగా..బాధితురాలికి తమ హాస్టల్‌లో ఆశ్రయం కల్పిస్తామని తీసుకొచ్చి… కొంత కాలంగా ఆ బాలికపై నందగోపాల్ అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలిక గర్భం దాల్చింది.

అక్టోబర్ 27వ తేదీన ఈ బాలిక తమ స్వగ్రామానికి వెళ్ళుతున్న సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆ బాలిక గర్భవతిగా తేలింది. ఈ నేపథ్యంలో బాలిక ఫిర్యాదు మేరకు సూపరింటెండెంట్ నందగోపాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ విషయమై సీరియస్ అయిన కడప జిల్లా కలెక్టర్ వెంటనే సూపరింటెండ్‌  కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కడప జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతి పోలీసులకు ఈ కేసును విచారణ చేసేందుకు బదిలీ చేశారు. ఈ బాలిక కేసును కడప జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.

ప్రభుత్వ హస్టల్ సూపరింటెండ్ నందగోపాల్ తనకు నచ్చిన అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడేవాడని బాధిత విద్యార్థినులు ఆరోపిస్తూనే ఈ హాస్టల్‌లో పని చేసేందుకు వచ్చే మహిళా ఉద్యోగినులను భయపెట్టి, లేదా.. ఇతరత్రా కారణాలు చూపించి ఇక్కడి నుండి వెళ్లిపోయేలా చేసేవాడని, అనాధలను అక్కున చేర్చుకోవాల్సిన అతడు వారిపై అత్యాచారానికి పాల్పడుతుండే వాడని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో గర్భం దాల్చిన బాధితురాలి ఫిర్యాదు మేరకు నందగోపాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిని జ్యూడీషీయల్ రిమాండ్‌కు తరలించారు.

‘‘సూపరింటెండ్ నిర్దోషి.. అ అమ్మాయే ఓ లెస్బియన్..’’

అయితే సూపరింటెండ్ నందగోపాల్  అరెస్ట్ కావడంతో బాలికల హాస్టల్ వద్ద సోమవారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సూపరింటెండెంట్ అరెస్ట్‌ను నిరసిస్తూ హాస్టల్లోని  కొందరు విద్యార్థినిలు నిరసనకు దిగారు. ఆ బాలికలంతా కలిసి హాస్టళ్లోని ఓ గదిలో తమను తాము బంధించుకుని ఆందోళన చెపట్టారు.

అంతేకాకుండా, వారు తమ చేతుల మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యా యత్నానికి కూడా సిద్దమయ్యారు. దీంతో హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  తమను సూపరింటెండ్ నందగోపాల్ తండ్రిలాగా చూసుకునేవాడని.. దాదాపు 16 మంది అనాధ బాలికలకు ఆయనే వివాహం చేశారని ఆ బాలికలు తెలిపారు.

అలాంటి వ్యక్తి ఆ బాలికపై అత్యాచారం చేశాడంటే తాము నమ్మడం లేదని, అయినా ఈ కేసు పెట్టిన బాలిక ఓ లెస్బియన్ అంటూ నిరసన చేపడుతున్న బాలికలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలీసులు అరెస్ట్ చేసిన సూపరింటెండ్‌ నందగోపాల్‌ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.  గాయాల కారణంగా ఎవరైనా చనిపోతే దానికి అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించాలని  విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -