26.7 C
Hyderabad
Thursday, October 15, 2026
- Advertisement -
Home 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు 2018: ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల, తొలివిడతగా 65 మంది…

తెలంగాణ ఎన్నికలు 2018: ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల, తొలివిడతగా 65 మంది…

telangana-elections-congress-candidates
- Advertisement -

హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల లొల్లి ఒక కొలిక్కి వచ్చింది. ఢిల్లీలో సోమవారం అర్ధరాత్రి వరకు సీట్లు, అభ్యర్థుల ఖరారుపై చర్చలు సాగాయి.  ఎట్టకేలకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా..  మరికొందరు కీలక నేతలు  చర్చించిన అనంతరం ఆర్ధరాత్రి ప్రాంతంలో కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

తొలి విడత జాబితాలో కాంగ్రెస్ 65 మంది అభ్యర్థులను ప్రకటించింది.  దాదాపు రెండు నెలల నిరీక్షణ తరువాత తెలంగాణ కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడం గమనార్హం. నవంబర్ 12న రాత్రి కచ్చితంగా తమ పార్టీ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుందని కుంతియా ముందే ప్రకటించారు.

ఆయన చెప్పినట్లుగానే రాత్రివరకూ సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన సుదీర్ఘ కసరత్తు అనంతరం అభ్యర్థుల జాబితాను రాహుల్‌ ఆమోదం కోసం పంపించి, ఆయన ఆమోదం తెలిపిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు తొలివిడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

కాంగ్రెస్ విడుదల చేసిన ఆ పార్టీ తొలి విడత జాబితాను పరిశీలిస్తే దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఆ పార్టీ అధిష్ఠానం సీట్లు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. అయితే వరంగల్ ఈస్ట్, వెస్ట్,.. అలాగే భూపాలపల్లి, వర్ధన్నపేట్, బెల్లంపల్లి, జనగామతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ లాంటి కీలక స్థానాలు మాత్రం ఇప్పటికీ  పెండింగ్‌‌లోనే ఉన్నాయి.

ఇదే కాంగ్రెస్ తెలంగాణ అభ్యర్థుల తొలివిడత జాబితా…

నియోజకవర్గం అభ్యర్థి పేరు
1 సిర్పూర్‌ డాక్టర్‌ పల్వాయి హరీష్‌ బాబు
2 చెన్నూరు (SC) వెంకటేశ్‌
3 మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు
4 ఆసిఫాబాద్‌ (ST) అత్రం సక్కు
5 ఆదిలాబాద్‌ సుజాత గండ్రాత్
6 నిర్మల్‌ అల్లేటి మహేశ్వర్‌రెడ్డి
7 ముధోల్ రమా రావు పటేల్ పవార్
8 ఆర్మూర్‌ ఆకుల లలిత
9 బోధన్‌ సుదర్శన్ రెడ్డి
10 జుక్కల్‌ (SC) సౌదాగర్ గంగారం
11 బాన్సువాడ కాసుల బాలరాజు
12 కామారెడ్డి షబ్బీర్ అలీ
13 జగిత్యాల జీవన్ రెడ్డి
14 రామగుండం ఎమ్మెస్ రాజ్‌ఠాకూర్
15 మంథని శ్రీధర్ బాబు దుద్దిల్ల
16 పెద్దపల్లి సి. విజయ రమణారావు
17 కరీంనగర్ పొన్నం ప్రభాకర్
18 చొప్పదండి (SC) మేడిపల్లి సత్యం
19 వేములవాడ ఆది శ్రీనివాస్
20 మానకొండూరు (SC) ఆరేపల్లి మోహన్
21 ఆందోల్ (SC) దామోదర రాజనర్సింహ
22 నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి
23 జహీరాబాద్ (SC) గీతారెడ్డి
24 సంగారెడ్డి జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)
25 గజ్వేల్ వంటేరు ప్రతాప్ రెడ్డి
26 కుత్బుల్లాపూర్ కూన శ్రీశైలం గౌడ్
27 మహేశ్వరం పి. సబితా ఇంద్రారెడ్డి
28 చేవెళ్ల (SC) కేఎస్ రత్నం
29 పరిగి రామ్మోహన్ రెడ్డి
30 వికారాబాద్ (SC) గడ్డం ప్రసాద్ కుమార్
31 తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి
32 ముషీరాబాద్ ఎం. అనిల్ కుమార్ యాదవ్
33 నాంపల్లి ఫిరోజ్ ఖాన్
34 గోషామహాల్ ముకేశ్ గౌడ్
35 చార్మినార్ మహ్మద్ గౌస్
36 చాంద్రాయణగుట్ట ఇసా బినోబాయిద్ మిస్రీ
37 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC) సర్వే సత్యనారాయణ
38 కొడంగల్ రేవంత్ రెడ్డి
39 జడ్చర్ల మల్లు రవి
40 వనపర్తి జి. చిన్నారెడ్డి
41 గద్వాల డీకే అరుణ
42 అలంపూర్ (SC) సంపత్ కుమార్
43 నాగర్ కర్నూలు నాగం జనార్ధన్ రెడ్డి
44 అచ్చంపేట (SC) సీ.హెచ్ వంశీకృష్ణ
45 కల్వకుర్తి వంశీ చంద్‌రెడ్డి
46 నాగార్జున సాగర్ జానారెడ్డి
47 హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
48 కోదాడ పద్మావతి రెడ్డి
49 సూర్యాపేట్ ఆర్. దామోదర్ రెడ్డి
50 నల్గొండ కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి
51 మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
52 భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి
53 నకిరేకల్ (SC) చిరుముర్తి లింగయ్య
54 ఆలేరు భిక్షమయ్య గౌడ్
55 స్టేషన్ ఘన్‌పూర్ (SC) సింగపూర్ ఇందిర
56 పాలకుర్తి జంగా రాఘవరెడ్డి
57 డోర్నకల్ (ST) జాటోత్ రామచంద్రు నాయక్
58 మహబూబాబాద్ (ST) పోరిక బలరాం నాయక్
59 నర్సంపేట్ దొంతి మాధవరెడ్డి
60 పరకాల కొండా సురేఖ
61 ములుగు (ST) డి. అనసూయ అలియాస్ సీతక్క
62 పినపాక (ST) రేగ కాంతారావు
63 మధిర (SC) మల్లు భట్టి విక్రమార్క
64 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు
65 భద్రాచలం (ST) పోడెం వీరయ్య
- Advertisement -