26.6 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home క్రైమ్ పబ్ జీ గేమ్ పిచ్చి.. ఫోన్‌లో అయిపోయిన బ్యాటరీ.. ఆ కోపంలో కాబోయే బావపైనే కత్తితో...

పబ్ జీ గేమ్ పిచ్చి.. ఫోన్‌లో అయిపోయిన బ్యాటరీ.. ఆ కోపంలో కాబోయే బావపైనే కత్తితో దాడి..

- Advertisement -

ముంబై: పబ్‌జీ.. ఇటీవల ఈ ఆన్‌లైన్ గేమ్ యమా క్రేజీగా మారింది. దీని మాయలో పడి ఎంతోమంది ప్రాణాలు కూడా తీసుకున్నారు. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ గేమ్‌ను నిషేధించాయి. తాజాగా, ఈ గేమ్‌కు బానిసగా మారిన ఓ వ్యక్తి తాను గేమ్ ఆడుతున్న ఫోన్‌లో చార్జింగ్ అయిపోవడంతో ఫ్రస్ట్రేషన్‌లో సొంత బావపైనే కత్తితో దాడి చేశాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ముంబైలోని కల్యాణ్ ప్రాంతంలో నివసించే రజనీశ్ రాజ్‌భర్ కల్యాణ్ పబ్‌జీ గేమ్‌కు బానిసయ్యాడు. గేమ్ ఆడుతుండగా ఫోన్ బ్యాటరీ నిండుకుంది. దీంతో చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించగా చార్జర్ వైరు తెగిపోయి ఉంది. వైరును తెంచేసింది తన సోదరే అని భావించిన రాజ్‌భర్ ఆమె ల్యాప్‌టాప్ వైరును కోసేశాడు. అంతటితో ఆగక ఆమెతో గొడవకు దిగాడు.

తప్పిన ప్రాణాపాయం…

ఇది చూసిన సోదరి కాబోయే భర్త ఓం.. రజనీష్‌ను మందలించాడు. అప్పటికే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న రజనీష్‌ పక్కనే ఉన్న కత్తి అందుకుని ఓం పొట్టలో పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఓంను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

ఇది రజనీష్ సమస్య మాత్రమే కాదు.. చాలామంది పిల్లలు పబ్‌జీ గేమ్‌కు బానిసల్లా మారి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. తమ పిల్లలు దీనికి బానిసలైపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్‌జీని నిషేధించినట్టు ప్రకటించగా, చాలా వరకు స్కూళ్లు, కాలేజీల్లో ఈ గేమ్‌ను నిషేధించారు.

- Advertisement -