

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ, డిప్యూటీ జైలర్లు తదితర పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న ప్రధాన పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. ఈ హాల్‌టిక్కెట్లను పోలీసు నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టిన తేదీ వివరాల ఆధారంగా హాల్‌టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
ఫిబ్రవరి 22 వరకు ఈ హాల్‌టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే అభ్యర్థులకు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో తుది పరీక్ష నిర్వహించనున్నారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలులో మెయిన్ పరీక్ష నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీలో ఎస్ఐ (సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ), డిప్యూటీ జైలర్లు, స్టేషన్ అగ్నిమాపక శాఖలో 334 పోస్టులకు 1.34 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి డిసెంబరు 16న రాతపరీక్ష నిర్వహించారు. డిసెంబరు 26న ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఫిజికల్ ఈవెంట్లకు మొత్తం 51,926 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
మళ్లీ వీరికి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 9 వరకు వివిధ జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. వీరిలో 43,980 మంది ఈవెంట్లకు హాజరుకాగా.. 32,745 మంది అభ్యర్థులు తుది పరీక్షకు అర్హత సాధించారు. ఫిబ్రవరి 23,24 తేదీల్లో నిర్వహించనున్న తుది పరీక్షలకు విశాఖపట్నం(8928), కాకినాడ(4654), గుంటూరు(11409), కర్నూలు(7754) నుంచి అభ్యర్థులు హాజరుకానున్నారు.
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌లో అభ్యర్థులకెవరికైనా ఇబ్బంది ఎదురైతే 9441450639 ఫోన్ నెంబరు లేదా mail-slprb@ap.gov.in అనే ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ఏపీ రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…








