దారుణం: ట్రైన్‌లో సిగరెట్ తాగొద్దన్నందుకు నిండు గర్భిణిపై దాడి, కుటుంబ సభ్యుల ముందే గొంతు పిసికి…

congress party supporter man suicide attempt at vikarabad
- Advertisement -

pregnant woman killed in train for objecting to smoking

షాజహాన్‌పూర్‌: రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికుడిని సిగరెట్ తాగొద్దని చెప్పినందుకు, నిండు గర్భిణిని కొట్టి చంపిన దారుణ సంఘటన పంజాబ్‌లో వెలుగు చూసింది.

పంజాబ్- బీహార్‌ల మధ్య నడిచే జలియన్‌వాలా ఎక్స్‌ప్రెస్‌ జనరల్ బోగీలో ప్రయాణం చేస్తున్న 45 ఏళ్ల చినత్ దేవి అనే గర్భిణి… అదే బోగిలో సోనూ యాదవ్ అనే తోటి ప్రయాణికుడు పొగ త్రాగుతుండడంతో ఇబ్బంది పడింది.  దీంతో ఆమె అతడి దగ్గరికి వెళ్లి రైల్లో సిగరెట్ తాగకూడదని  చెప్పింది.  ఈ విషయంలో అతనికీ, దేవికి మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది.

నిండు గర్భిణి అని కూడా చూడకుండా…

మాటా మాటా పెరగడంతో ఆవేశం కోల్పోయిన సోనూ యాదవ్, నిండు గర్భిణి అని కూడా చూడకుండా చినత్ దేవిపపై చెయ్యి చేసుకున్నాడు. అంతటితో ఊరుకోకుండా ఆమె గొంతు పట్టుకుని గట్టిగా పిసికేశాడు. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చినత్ దేవిని  చూసి  తోటి ప్రయాణికులు సోనూ యాదవ్‌ని అడ్డుకుని షాజహాన్‌పూర్‌లో రైలును ఆపి, ఆమెను ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.  దీంతో మృతురాలి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా,  సోనూ యాదవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. చినత్ దేవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

దాడి జరుగుతుంటే.. చోద్యం చూసిన ప్రయాణికులు?

మృతురాలి కుటుంబీకులు పంజాబ్ నుంచి బీహార్‌కు పండగకు వెళుతుండగా.. రైలులో ఈ దారుణం చోటుచేసుకుందని,  రైలులో పొగ త్రాగడం నేరమని, మరి సోనూ యాదవ్ యథేచ్ఛగా సిగరెట్ కాలుస్తుంటే టిక్కెట్ కలెక్టర్ ఏం చేస్తున్నాడనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.

నిండు గర్భిణిపై యువకుడు దారుణంగా దాడి చేస్తుంటే తోటి ప్రయాణికులు కూడా చోద్యం చూస్తూ ఉండిపోయారని చినత్ దేవి  కుటుంబీకులు తీవ్ర  ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: కృష్ణా జిల్లాలో మరో నిర్భయ తరహా కేసు, మహిళను తీవ్రంగా కొట్టి.. జననాంగంలోకి కర్ర చొప్పించి…

చదవండి: షాకింగ్: అమ్మాయి ప్రేమించడం లేదని.. కత్తితో పొడిచేశాడు, అడ్డొచ్చిన అమ్మాయి తమ్ముడ్ని కూడా…

- Advertisement -