ప్రొ కబడ్డీ లీగ్‌‌ 2018: రైడింగ్‌లో చెలరేగిన పాట్నా ఆటగాళ్లు.. పైరేట్స్‌ ఖాతాలో ఐదో విజయం, మరో మ్యాచ్‌లో…

patna pirates wins against bengal warriors in pro kabaddi league 2018
- Advertisement -

patna pirates wins against bengal warriors in pro kabaddi league 2018

ముంబై: ప్రో కబడ్డీ లీగ్‌ 2018 ఆరో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పాట్నా పైరేట్స్‌ ఐదో విజయన్ని తన ఖాతాలో వేసుకుంది. బెంగాల్‌ వారియర్స్‌తో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌ 50–30తో ఘన విజయం సాధించింది. ‘డుబ్కీ’ కింగ్‌ పర్దీప్ నర్వాల్‌ 11 పాయింట్లు, దీపక్‌ నర్వాల్‌ 13 పాయింట్లతో చెలరేగి ఆడారు. అలాగే ఈ జట్టులో జైదీప్ 5 పాయింట్లు, వికాస్ 3 పాయింట్లు, రవీందర్ 3 పాయింట్లతో రాణించారు.

బెంగాల్‌ వారియర్స్‌ జట్టులో మణిందర్ 6 పాయింట్లు, రణ్ సింగ్ 3 పాయింట్లు, బల్దేవ్ సింగ్ 3 పాయింట్లు, ఆదర్శ్ 3 పాయింట్లు సాధించారు. తొలి అర్ధభాగం విరామ సమయానికి పాట్నా పైరేట్స్ 22-14 స్కోరుతో ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించింది. ఇక రెండవ అర్ధభాగంలో కూడా పాట్నా పైరేట్స్‌ ఆటగాళ్లు మరింత విజృంభించి రెండుసార్లు బెంగాల్‌ వారియర్స్‌ జట్టును ఆలౌట్‌ చేశారు.

ఆరంభం నుంచే రైడింగ్‌లో చెలరేగిన పాట్నా పైరేట్స్‌ ..

దీంతో బెంగాల్‌ వారియర్స్‌ జట్టు 14 పాయింట్లపై ఉండగానే.. పాట్నాపైరేట్స్‌ జట్టు పాయింట్లు 32కు చేరుకున్నాయి. ఆరంభం నుంచే రైడింగ్‌లో చెలరేగిన పాట్నా పైరేట్స్‌ .. ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసి తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు బెంగాల్‌ వారియర్స్‌కు ఈ మ్యాచ్‌లో ఏదీ కలిసిరాలేదు.

ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఇది మూడో ఓటమి. దీపక్ రైడింగ్‌లో రాణించినా.. ట్యాకిలింగ్‌లో మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు.  ఈ మ్యాచ్‌ను బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తన  స్నేహితులతో కలిసి వీక్షించారు.

యు ముంబాపై గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ విజయం… 

ప్రొ కబడ్డీ లీగ్‌ జోన్-ఎ మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ 38-36 స్వల్ప స్కోరు తేడాతో యు ముంబా జట్టుపై విజయం సాధించింది. రైడింగ్‌లో అదరగొట్టిన సచిన్ 9 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే పర్వేశ్ 4 పాయింట్లు, సునీల్ 3 పాయిట్లు, రోహిత్ 2 పాయింట్లతో జట్టుకు చక్కని సహకారాన్ని అందించారు.

ఇక యు ముంబా తరఫున సిద్ధార్థ్ 13 పాయింట్లు సాధించినా అ జట్టుకు ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. యు ముంబా తరపున రోహిత్ బలియాన్ 7 పాయింట్లు, ఫజల్ అత్రచలి 3 పాయింట్లు, రోహిత్ రాణా 2 పాయింట్లు సాధించారు.

- Advertisement -