29.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home క్రైమ్ చావులోనూ మోసమేనా?: ఎదురుగా రైలు వచ్చేసరికి.. ప్రియుడు జంప్, ప్రియురాలు ఔట్!

చావులోనూ మోసమేనా?: ఎదురుగా రైలు వచ్చేసరికి.. ప్రియుడు జంప్, ప్రియురాలు ఔట్!

- Advertisement -

హైదరాబాద్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. నువ్వే సర్వస్వం అన్నాడు ప్రియుడు. ఇంకా ఎన్నెన్నో బాసలు చేశాడు. పాపం నిజమే అనుకుని నమ్మేసిందామె. ఒకరోజు మన పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని, ఇక మనకు చావే దిక్కని అంటే.. ఆ మాటలూ గుడ్డిగా నమ్మి అతడి వెంటే నడిచిందామె.

కట్ చేస్తే.. ఏదైనా రైలు కింద పడి తనువు చాలించాలని అనుకున్నారు. ఇద్దరూ రైలు పట్టాలపై నిలుచున్నారు. దూరంగా రైలు కనిపించింది. దగ్గరికి వచ్చేస్తోంది. ఆమె కళ్లుమూసుకుంది. ప్రియుడి గుండెల్లోనే ఏదో దఢ. తీరా రైలు వచ్చేసరికి ఆమెను వదిలేసి ప్రియుడు పక్కకి జంప్ చేశాడు.

రైలుకేం తెలుసు.. నిలబడి ఉన్న ప్రియురాలిని గుద్దేసింది. ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ప్రియుడు మాత్రం క్షేమంగానే తన ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? చావు ముంగిట కూడా మోసమేనా?

ఈ ఘటన నిజంగానే జరిగింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీ వాసులుగా భావిస్తోన్న యువతీ యువకులు ఇద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఒకరోజు ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకుని సమీపంలోని రైతు పట్టాల వద్దకు వెళ్లి నిలబడ్డారు.

తీరా రైలు దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రియుడికి ప్రేమకన్నా ప్రాణమే విలువైనదిగా తోచింది. ప్రియురాలిని నిర్ధాక్షిణ్యంగా పట్టాలపైనే వదిలేసి తాను మాత్రం పక్కకి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చదవండి:  షాకింగ్: విడాకులు అడిగిన భార్య.. బతికుండగానే పూడ్చేసిన భర్త!
- Advertisement -