26.2 C
Hyderabad
Wednesday, November 25, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఉగ్రరూపం దాల్చిన ఫణి! మరికొద్దిసేపట్లో భారీ వర్షం!

ఉగ్రరూపం దాల్చిన ఫణి! మరికొద్దిసేపట్లో భారీ వర్షం!

- Advertisement -
అమరావతి: రోజులు మారేకొద్దీ వాతావరణం కూడా మారిపోతుంది అని ఆనాడే ఎంతోమంది చెప్పారు. అలాగే శాస్త్రవేత్తలు కూడా ఇదే చెప్తున్నారు. మండు వేసవిలో ఎండలతోపాటుగా, వర్షాలు కూడా ఇప్పుడు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. భగ భగ మండే ఎండలు ఒక వైపు , చల్లగా కురిసే చిరుజల్లులు మరోవైపు ప్రజలని భయపెడుతున్నాయి. తెలంగాణాలో వేడితాపం పెరిగిపోతుంటే , అటు ఏపీలో చల్లగా గాలులు వీస్తున్నాయి. ఫణి తుఫాన్ దక్షణాది రాష్ట్రాలని భయానికి గురిచేస్తుంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దక్షణాది రాష్ట్రాలని వణికిస్తుంది. ఈ అల్పపీడనం శనివారం తీవ్రవాయుగుండంగా మారిపోయింది. నేటి సాయంత్రానికి ఇది తీవ్రమైన తుపాన్ గా మారే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తానికి మరో రెండు రోజుల్లో ఇది తీవ్ర పెను తుపానుగా మారబోతునట్టుగా ఒక ప్రకటన విడుదల చేసారు.

ఇక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 30 నాటికి తుపాన్ తమిళనాడు, ఏపీ లో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తున్నా, కానీ ఈ తుపాన్ తన దిశని మార్చుకుంటుంది అని అధికారులు తెలియజేసారు. తీవ్ర తుపానుగా మారిన తరువాత ఏపీ, ఒడిశా తీరం వెంబడి ప్రయాణించి , పశ్చిమబెంగాల్ వైపుకి తన దిశని మార్చుకునేందుకు అనువైన వాతావరణం ఉన్నట్టు అధికారులు తెలియజేసారు.

ఇదే సమయంలో ఏపీలోని కోస్తాఆంధ్రా , ఉత్తరాంధ్ర ప్రాంతాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు పడుతాయని తెలియజేసారు. అలాగే ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అటు తుపాన్ తీరానికి దగ్గరగా వెళ్తుందా లేదా అనేది తీవ్ర రూప దాల్చిన తరువాత అంచనా వేయచ్చు అని తెలిపారు.

 
- Advertisement -