తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఓ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న వ్యక్తి.. ఓ మైనర్ బాలికపై గత నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల వయసులో ప్రాథమిక విద్య అనంతరం తిరుపతి షెల్టర్ హోమ్‌కు వచ్చిన బాలికపై వసతి గృహం సూపరింటెండెంట్ సాగించిన అకృత్యాలు బాధితురాలి ఫిర్యాదుతో బయటపడ్డాయి.
ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లాకు చెందిన బాలికకు తల్లి గతంలో చనిపోగా, తండ్రి జీవితఖైదు అనుభవిస్తున్నాడు. 2012లో అప్పర్ ప్రైమరీ పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ప్రాథమిక ఉన్నత విద్య కోసం ఆ బాలికను తిరుపతిలోని ప్రభుత్వం నడుపుతున్న షెల్టర్ హోమ్‌కు తరలించారు.
చదవండి: షాకింగ్: మద్యం మత్తులో.. సొంత చెల్లెలిపైనే.. అన్నఅత్యాచారం, తండ్రి నిద్రపోగానే…
ఇక అప్పటినుంచీ బాలికకు వేధింపులు మొదలయ్యాయి. తిరుపతి బాలికల వసతి గృహం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న బత్యాల నందగోపాల్ ఆ మైనర్ బాలికను చిత్రహింసలకు గురిచేసేవాడు. రాత్రిళ్లు తన గదికి రావాలని లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. బాలిక అందుకు ఒప్పుకోకపోతే చావబాది లోబర్చుకునేవాడు.
ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబర్ 27న ఆ బాలికను కడపలోని బాలికల వసతి గృహానికి బదిలీచేశారు. ఈ నేపథ్యంలో ఆ బాలిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ శివకామినిని కలిసి.. ఇన్నాళ్లూ తాను అనుభవించిన నరకాన్ని, తనపై జరిగిన దారుణాలను వివరించింది.
చదవండి: ఘోరం: అటవీశాఖ వెదురు డిపోలో యువతి మృతదేహం! హత్యకు ముందు అత్యాచారం.. ప్రియుడిపైనే పోలీసుల అనుమానం
ఆమె సమచారం మేరకు తిరుపతి పోలీసులు నిందితుడు నందగోపాల్‌పై ఐపీసీ సెక్షన్ 376తో పాటు పోక్సో చట్టం 2012 ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కడపలోని రిమ్స్‌కు తరలించారు.
అయితే బాలికల వసతి గృహం సూపరింటెండెంట్ నందగోపాల్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. గత పదేళ్లుగా తాను సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నానని, తిరుపతి షెల్టర్ హోంలో 150 మంది వరకు బాలికలు ఉన్నారని, తాను ఎన్నడూ.. ఎవరిపైనా.. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదని తెలిపాడు.
ఇదిలా ఉండగా.. కడప రిమ్స్ వైద్యుల నుంచి నివేదిక వచ్చాక నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.