ఉత్తర కాలిఫోర్నియాను వణికిస్తోన్న కార్చిచ్చు.. ఇప్పటికే 9 మంది మృతి.. 6,700 ఇళ్లు బుగ్గిపాలు…

wild-fire-in-north-california
- Advertisement -

california-wild-fire

వాషింగ్టన్: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాను కార్చిచ్చు దహించివేస్తోంది. అగ్నికిలల ధాటికి ఇప్పటికే 9 మంది నగరవాసులు మృత్యువాత పడగా… 35 మంది జాడ తెలియడం లేదు. ఉత్తర కాలిఫోర్నియాలో ఉన్న ఓ మౌంటెన్ టౌన్‌లో ఈ కార్చిచ్చు అంటుకుంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఫైర్ కంట్రోల్ సిబ్బందికూడా గాయపడ్డారు.

ఈ కార్చిచ్చు కారణంగా ఉత్తర కాలిఫోర్నియాలోని ప్యారైడైజ్‌లో అగ్నికీలకలు సుమారు 362 చదరపు కిలోమీటర్లు విస్తరించాయి. మంటలు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  ఈ కార్చిచ్చు దెబ్బకు ఈ ప్రాంతంలో ఉన్న 6,453 ఇళ్లు, 260 వ్యాపార సముదాయాలు బుగ్గిపాలయ్యాయి.

ఇళ్లు ఖాళీ చేయాలంటూ హాలీవుడ్ స్టార్స్‌కు నోటీసులు…

అగ్నికిలలు ఎగిసి పడుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మంటలు  ప్యారడైజ్  నుంచి హాలీవుడ్ తారలు, సంపన్నులు ఎక్కువగా నివసించే మాలిబూ నగరానికి వ్యాపించాయి. హాలీవుడ్ స్టార్స్ కిమ్ కర్దషియాన్‌, లేడీగాగా వంటి వారు కూడా ఇళ్లు ఖాళీ చేసి పోవాల్సిందిగా నోటీసులు అందుకున్న వారిలో ఉండడం విశేషం.

కార్చిచ్చు కారణంగా 90 వేల ఏకరాల కాలిపోయాయని, ఓ స్కూల్ బస్సుతో పాటు చాలా వాహనాలు మంటల్లో చిక్కుక్కుని కాలి బూడిదయ్యాయని అధికారులు తెలిపారు. మృతులు 9 మందిలో.. ఐదుగురు కార్లలో, ముగ్గురు ఇంటి బయట, మరొకరు ఇంట్లో చిక్కుకుని చనిపోయారని అధికారులు తెలిపారు.  ఇప్పటి వరకు సుమారు 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, గడిచిన వందేళ్లలో ఈ స్థాయిలో మంటలు ఎప్పుడూ వ్యాపించలేదని వారు పేర్కన్నారు.

wild-fire-in-malibu

కాలిఫోర్నియా చరిత్రలోనే తొలిసారి…

కాలిఫోర్నియా చరిత్రలోనే ఇంత భారీగా అగ్నిప్రమాదం జరగడం ఇదే మొదటిసారని కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొడక్షన్ డేటా విభాగం తెలియచేసింది.ఈ ప్రాంతంలో 6700లకు పైగా ఇళ్లు, వ్యాపార సముదాయాలు ఉండడంతో మంటలు అదుపులోకి వచ్చేదాకా వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కార్చిచ్చు కారణంగా దాదాపు 35 మంది జాడ తెలియకపోవడంతో.. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఫైర్‌పైటర్స్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. అడవిలో మొదలైన కార్చిచ్చు… కొద్దిసేపట్లోనే నగరానికి వ్యాపించిందని, స్థానికులు మంటలను గుర్తించి స్పందించేలోపే తొమ్మిది మంది చనిపోయారని తెలుస్తోంది. బూడిదయ్యాయి.

 

- Advertisement -