షాకింగ్: పిల్లల్ని బంధించి.. తల్లిపై గ్యాంగ్ రేప్, బంధువులే కిరాతకంగా…

married-woman-gang-rape-by-relatives

చాంద్రాయణగుట్ట: ఓ భర్త ఆటో నడిపేందుకు బయటికి వెళ్లగా అతడి భార్య పిల్లలతో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించిన ఆమె బంధువులే ఆమెపై దారుణానికి ఒడిగట్టిన ఉదంతమిది.

ఆమె నలుగురు పిల్లలను ఒక గదిలో బంధించి ఆమెపై వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరు బెదిరిస్తూ ఉండగా మరో ఇద్దరు సభ్య సమాజం తలదించుకునే రీతిలో మృగాల్లా ప్రవర్తించి తమ కోరిక తీర్చుకున్నారు.

నగర శివారులోని పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హర్యానా నుంచి షాకీర్‌ ఖాన్‌ కుటుంబం ఇటీవలే వలస వచ్చి జల్‌పల్లి వాదే ముస్తఫా బస్తీలో నివాసం ఉంటుంది. షాకీర్‌ ఖాన్‌ జీవనోపాధి కోసం ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య(25) నలుగురు పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉంటోంది.

వీరి బంధువులు కూడా అక్కడి దగ్గరలోనే ఉంటున్నారు. శనివారం ఉదయం షాకీర్‌ ఖాన్‌ ఆటో కోసం వెళ్లగా, అతడి భార్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన బంధువులు ఆజాద్, అంజాద్‌లతో పాటు వారి మరో స్నేహితుడు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి మంచినీళ్లు అడిగారు.

తెలిసిన వారే కావడంతో ఆమె మంచినీళ్లు తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది. అదే అదనుగా వీరు కూడా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

మూడో వ్యక్తి ఇంట్లో ఉన్న నలుగురు పిల్లలను పక్క గదిలో ఉంచి ఎవరికైనా చెపితే చంపేస్తామంటూ బెదిరించి కాపలా ఉండగా, మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికిపాల్పడ్డారు. విధులు ముగించుకొని అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకున్న ఆమె భర్త జరిగిన ఘోరాన్ని తెలుసుకుని కుమిలిపోయాడు.

ఆదివారం పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

దర్యాప్తు అధికారుల సందిగ్ధం…

బాధితురాలు నివసిస్తోన్న ఇల్లు హైదరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల సరిహద్దుగా ఉండడంతో ఇరు కమిషనరేట్ల అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇటు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని దక్షిణ మండలం డీసీపీ అంబర్‌ కిషోర్‌ ఝా, ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్‌ ఎం.ఎ.రషీద్, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ జి.కోటేశ్వర్‌ రావులు రాగా… అటు రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వనస్థలిపురం ఇన్‌ఛార్జి ఏసీపీ యాదగిరి రెడ్డి, పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శంకర్‌లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఇరు వర్గాలు నేరం జరిగిన స్థలం తమ పరిధి కాదంటే… తమ పరిధి కాదంటూ సతమతమయ్యారు. చివరకు పహాడీషరీఫ్‌ పోలీసులే ఈ ఘోరంపై కేసు నమోదు చేశారు. దీనిపై రెవెన్యూ అధికారుల సూచనకనుగుణంగా అవసరమైతే తామే కేసును బదిలీకి తీసుకుంటామని ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్‌ ఎం.ఎ.రషీద్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

దారుణం: గంజాయి తాగించి.. వివస్త్రను చేసి యువతిపై బ్లేడుతో దాడి, వీడియో..
షాకింగ్: తల్లి అయిన ఇంటర్‌ విద్యార్థిని! కారణం ఎవరో తెలుసా?
దారుణం: కొత్త పెళ్లికొడుకు అఘాయిత్యం! మరదల్ని కిడ్నాప్ చేసి.. పలుమార్లు అత్యాచారం…
రాత్రి పూట అర్జెంట్ అని అమ్మాయిని ఇంటికి పిలిచి….