పవన్ కళ్యాణ్‌కి ఆడాళ్లంటే పిచ్చి! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Sri-Reddy

హైదరాబాద్: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి అనే పేరు తెలియని తెలుగు వారు ఉండరని చెప్పుకోవచ్చు. అంతలా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు. గత కొంతకాలంగా టాలీవుడ్ కి దూరంగా కోలీవుడ్ కి దగ్గరగా వెళ్లి నా, పెద్దగాలాభం లేకుండా పోయింది. మొదట టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పేరిట ఉద్యమమే మొదలుపెట్టింది.

పెను ప్రకంపనలు సృష్టించి ఆ తరువాత సైడ్ అయిన ఆమె, తాజాగా మళ్ళి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఇటు సినిమా వాళ్ళను,అటు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ పెను వివాదాలకు తెర తీస్తుంది.

త్రివిక్రమ్ కూడా అలాంటివాడే…

అలా తాజాగా పవన్ కళ్యాణ్ గురించి పూనమ్ కౌర్ మాట్లాడిన మాటలు అంటూ ఓ ఆడియో టేప్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.ఇప్పుడు ఆ ఆడియోకి సంబంధించి శ్రీరెడ్డి ఓ వీడియో రూపొందించింది. ఇందులో ఆమె పూనమ్ ని సపోర్ట్ చేస్తూ, పవన్, త్రివిక్రమ్ లను తిట్టిపోసింది.

పవన్, త్రివిక్రమ్ లకు అమ్మాయిల పిచ్చని, చాలా మంది జీవితాలతో వాళ్లు ఆడుకున్నారని, అది వాళ్ల గేమ్ ప్లానింగ్ అని మరో సంచలన కామెంట్స్ చేసింది. పవన్ ని గురువుగా భావించిన పూనమ్ఆ, తరువాత అతడి కారణంగానే సూసైడ్ చేసుకోవడానికి ప్రయతించింది అని శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది.

పార్వతి మెల్టన్, త్రివిక్రమ్ ని ప్రేమిస్తే ఆమె లైఫ్ తో కూడా ఆడుకున్నాడని, ఆ కారణంగా ఆమె ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయిందని షాకింగ్ కామెంట్స్ చేసింది.పవన్ కారణంగా చాలా మంది అమ్మయిలు బాధ పడ్డారని, రేణు దేశాయ్ విషయంలో కూడా అదే జరిగిందని చెప్పింది.

ఇప్పుడున్న అమ్మాయి పరిస్థితి ఏమవుతుందోనని సందేహం వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యక్తి సీఎం పదవికి ఎలా అర్హుడవుతాడని,ఇలాంటి వ్యక్తినా మనం ఎన్నుకునేది అంటూ మళ్ళి ఘాటు వ్యాఖ్యలు చేసింది.