33.1 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home క్రైమ్ వీడు మనిషేనా?: ‘‘ఫోన్ చేస్తే మాట్లాడాలి.. పిలిచినప్పుడల్లా వచ్చి నా కోరిక తీర్చాలి.. లేదంటే..’’

వీడు మనిషేనా?: ‘‘ఫోన్ చేస్తే మాట్లాడాలి.. పిలిచినప్పుడల్లా వచ్చి నా కోరిక తీర్చాలి.. లేదంటే..’’

hyderabad woman stuck in US
- Advertisement -

woman-molested-by-a-man-in-hyderabad

హైదరాబాద్: ‘‘ఫోన్ చేస్తే మాట్లాడాలి.. పిలిచినప్పుడల్లా రావాలి.. కోరిక తీర్చాలి.. లేదంటే.. యాసిడ్ పోస్తా..’’ అంటూ ఓ వ్యక్తి బరితెగించి ఓ వివాహితను లైంగిక వేధింపులకు గురిచేస్తోన్న ఉదంతమిది. అతడి వేధింపులు అధికమవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.

వివరాల్లోకి వెళితే… హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ ప్రాంతంలోని వినాయక నగర్ బస్తీకి చెందిన ఓ వివాహిత(28) టైలరింగ్ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన రాజు అనే వ్యక్తి ఆమెపై కన్నేశాడు. కొంతకాలంగా తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించసాగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అతడికి కోపం వచ్చింది. అప్పట్నించి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు.

తాను ఫోన్ చేసినప్పుడల్లా ఎత్తాలని, పిలిచినప్పుడల్లా వచ్చి తన కోరిక తీర్చాలని.. లేదంటే ఆమె కుటుంబ సభ్యులపై యాసిడ్ పోస్తానంటూ బెదిరించసాగాడు. అతడి వేధింపులు తారస్థాయికి చేరడంతో ఇక తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రాజును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

చదవండి: దారుణం: కూతురిపై తండ్రి, బాబాయ్‌లే.. మూడేళ్లుగా అదే తంతు.. తెలిసినా మిన్నకుండిపోయిన తల్లి!

చదవండి: దారుణం: ఇంజనీరింగ్ విద్యార్థినిపై అన్నయ్య స్నేహితుడే.. మరో ఐదుగురితో కలిసి రెండ్రోజులపాటు…

- Advertisement -

1 COMMENT

  1. ఇలాంటి వెధవలకు సమాజంలో బతికే అర్హత లేదు.. అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచి.. వాడు మళ్లీ బెయిల్ మీద బయటికొచ్చి… పోలీసులకు పట్టిచ్చిందన్న కోపంతో వాడు మళ్లీ ఏ యాసిడ్ దాడో చేసి… ఇదంతా ఎందుకు? వాడు మళ్లీ వేధింపులకు పాల్పడడని గ్యారెంటీ ఈ పోలీసులు ఇస్తారా? అందుకే ఇలాంటి వారిని నేరం చేసిన వెంటనే పబ్లిగ్గా కాల్చిపారేయాలి…