విజయవాడ: మహిళతో వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పొయాడు. ఆ వివాహిత బంధువులు అతడ్ని చంపి, బాయిలర్‌లో వేసి తగలబెట్టేశారు. ఈ ఘోరం కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో చోటు చేసుకుంది. చిత్తపూరుకు చెందిన గోపి అనే యువకుడు మైలవరం బాలయోగి నగర్‌కు చెందిన ఓ మహిళతో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు గోపిని పిలిపించి మందలించారు. అయిన అతడు తరచూ ఆమెను కలుస్తుండటంతో ఆ వివాహిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎలాగైనా గోపిని హత్య చేయాలని ప్లాన్ చేశారు.
ఈ క్రమంలో మహిళ బంధువులు అయిన చెరుకుపల్లి రాఘవ, మిరియాల పండు, జమలయ్యలు గోపిపై దాడి చేసి అతడిని చితకబాదారు. ఈ దాడిలో గోపి చనిపోవడంతో అతడి మృతదేహాని పొందుగుల సమీపంలోని ఎర్రచెరువులో ఉన్నబాయిలర్‌లో పడేసి. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు.
ఎర్ర చెరువు దగ్గర కొద్దిరోజుల నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాయిలర్‌లో ఉన్న మృతదేహాన్ని కిందికి దించి, అది గోపి మృతదేహంగా గుర్తించారు. అనంతరం అతడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.