పచ్చని కాపురంలో.. చిచ్చు పెట్టిన వాట్సాప్‌ న్యూడ్‌ వీడియో!

kerala woman fighting with attribution wrong nude video
- Advertisement -

kerala woman fighting with attribution wrong nude video

కొచ్చి: నకిలీ వార్తలు, పుకార్లతో దేశవ్యాప్తంగా ఘర్షణలు, అల్లర్లు చెలరేగి పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు తెలిసిందే. కేరళలోని కొచ్చిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.  ఓ వ్యక్తి పొరపాటుగా పోస్టు చేసిన ఓ అడల్ట్‌ వీడియో శోభ అనే వివాహిత జీవితాన్ని నాశనం చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాజు జోసెఫ్‌కు చెందిన విద్యుత్‌ పరికరాల కంపెనీలో లిట్టో తంకచన్‌ ఉద్యోగం చేసేవాడు. 2015లో లిట్టో ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో న్యూడ్‌ వీడియో ఒకటి పోస్టు చేశాడు. వీడియోలో ఉన్నది సాజు భార్య శోభ (36) అని అతడు పేర్కొన్నాడు.

దీంతో సాజు కుటుంబంలో ఒకసారిగా చిచ్చు రేగింది. నగ్నంగా ఉన్న వీడియోను శోభనే కావాలనే ఇతరులకు పంపిందని ఆరోపిస్తూ సాజు తన ముగ్గురు పిల్లలతో కలిసి మూడేళ్లుగా ఆమెకు దూరంగా ఉండడమే కాకుండా భార్యతో విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు.

లిట్టోని అరెస్టు చేసిన పోలీసులు..

తన పేరును, కుటుంబ పరువును బజారుకీడ్చిన లిట్టోపై శోభ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వీడియోలో ఉన్నది తాను కాదంటూ.. అందులో ఉన్నదెవరో తేల్చాలని శోభ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

దీంతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు.. రాష్ట్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి ఆ వీడియోను పంపించి విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా వీడియోలో ఉన్నది శోభ కాదని తేల్చారు. అయితే, వీడియో అస్పష్టంగా ఉండడంతో అది ఎక్కడి నుంచి వచ్చిందనే సమాచారం సైతం కనుక్కోలేకపోతున్నామని ఫోరెన్సిక్‌ లేబొరేటరీ తమ నిసహాయతను తెలియజేసింది.

ఓ వ్యక్తి చేసిన పొరపాటు వల్ల తన జీవితం నాశనమైందని శోభ వాపోయారు.  చెయ్యని తప్పుకు మూడేళ్లుగా తన పిల్లలకు దూరంగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అందరిలా నా పిల్లలు.. బయట తిరగకూడదా? వాళ్ల అమ్మ క్యారెక్టర్‌ గురించి ఎవరైనా నీచంగా మాట్లాడితే వాళ్లు భరించగలరా? అంటూ శోభ కన్నీటి పర్యంతం అయ్యారు.

వీడియోలో ఉన్నది తాను కాకపోయినా.. తన జీవితంలో తీవ్ర అలజడి రేగిందనీ, ఇప్పటికీ ఆ వీడియో షేర్‌ కాకుండా సైబర్‌ క్రైం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని శోభ వాపోయారు.

అయితే వీడియో వ్యవహారం ఎలా ఉన్నా.. శోభ భర్త సాజు మాత్రం మొండికేసి కూర్చున్నారు.   అ వీడియోలో ఉన్నది శోభ కాకున్నా..  మళ్లీ ఆమెను తమ జీవితాల్లోకి ఆహ్వానించబోమని ఆయన వెల్లడించారు. తామిక కలిసేది లేదంటూ తెగేసి చెబుతున్నారు.  వార్నీ.. ఒక్క న్యూడ్ వీడియో ఎంత పని చేసింది!

- Advertisement -