ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నాయకులు…

politicians celebrities and sports personalities cast their votes in Hyderabad2
- Advertisement -

politicians celebrities and sports personalities cast their votes in Hyderabad

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సినీ నటులు, రాజకీయ నాయకులు తదితర ప్రముఖులు శుక్రవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టాలీవుడ్ నటులు చిరంజీవి ఆయన సతీమణి సురేఖ, చిన్న కుమార్తె శ్రీజతో కలిసి జూబ్లిహిల్స్‌లో ఓటేశారు. నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున తన సతీమణి అమలతో కలిసి వెళ్లి ఓటేశారు.

అలాగే నటులు అల్లు అర్జున్, నితిన్, వడ్డే నవీన్‌, శ్రీకాంత్, ఊహ, విజయశాంతి, సునిల్ తదితరులు కూడా హైదరాబాద్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రీడాకారిణులు గుత్తా జ్వాల, పీవీ సింధూ కూడా ఓటు వేశారు.

ఇక మంత్రులు హరీష్ రావు, జగదీష్ రావు శుక్రవారం ఉదయమే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హరీష్ రావు సిద్ధిపేటలోను, జగదీష్ రావు సూర్యాపేటలోను ఓటేశారు. వరంగల్‌లో కడియం శ్రీహరి ఓటేశారు. కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని మెహదీపట్నంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -