- Advertisement -
హైదరాబాద్: ప్రజాకూటమి తరపున కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి సుహాసిని పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్రను వెంటనే బదిలీ చేయాలని కోరారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను టీఆర్‌ఎస్ కార్యకర్తలు బెదిరిస్తున్నారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ శుక్రవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్, ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని కూడా నందమూరి సుహాసిని ఎన్నికల సంఘాన్ని కోరారు.
- Advertisement -