26.1 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home క్రైమ్ బాలికపై 11 మంది గ్యాంగ్ రేప్: హోంమంత్రి సీరియస్, మహిళా అధికారికి దర్యాప్తు బాధ్యతలు, అవే...

బాలికపై 11 మంది గ్యాంగ్ రేప్: హోంమంత్రి సీరియస్, మహిళా అధికారికి దర్యాప్తు బాధ్యతలు, అవే కీలకం…

girl-gang-rape-in-hyd-old-city-1
- Advertisement -

kamatipura-girl-gang-rape-protest

నిందితుడిని సాక్షిగా పేర్కొనడాన్ని నిరసిస్తూ కామాటిపురా పోలీస్ స్టేషన్ వద్ద స్థానికులు ఆందోళన నిర్వహిస్తున్న దృశ్యం

_________________________________________________________________________

హైదరాబాద్: పాతబస్తీలోని కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించి.. సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులను కఠినంగా శిక్షించమంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో స్పందించిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ కేసును కామాటిపురా పోలీస్ స్టేషన్ నుంచి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం: బాలికపై 11 మంది గ్యాంగ్ రేప్, షాకింగ్ విషయం ఏమిటంటే…

కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లాకిడి ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక(16)పై నాలుగేళ్లుగా 11 మంది అత్యాచారానికి పాల్పడడం, దీనిపై ఆ బాలిక తల్లిదండ్రుల సహకరంతో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న కామాటిపురా పోలీసులు ఓ నిందితుడిని సాక్షిగా చేర్చడం, దానిపై మొన్న ఆదివారం నాడు ఆ బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగడం తెలిసిందే.

అనంతరం కామాటిపురా పోలీసులు సాక్షిగా పెట్టిన యువకుడిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ఈ కేసు దర్యాప్తును తాజాగా సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీదేవికి అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో మరింతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

kamatipura-girl-gang-rape-accusedఈ కేసులో తొలుత బాధిత బాలిక బంధువు రాజేష్, అతడి స్నేహితులు శుభం వ్యాస్, అభిజిత్‌లను అరెస్టు చేశారు. తాజా ఆందోళనతో మరో నిందితుడైన విజయ్ కుమార్‌ను కూడా అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులో నిందితులగా ఉన్న మరో ఏడుగురి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ కేసులో అవే కీలకం…

బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు అత్యంత కీలకంగా మారాయి. అత్యాచారం సమయంలో నిందితులు ఆ ద‌ృశ్యాలను వీడియో తీయడమేకాక, ఆ తరువాత వాటిని షేర్ చేసుకున్నారు. అయితే పోలీసులు నలుగురు నిందితుల నుంచి వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించగా వాటిలో ఎలాంటి వీడియోలు లేకపోవడంతో.. బహుశా నిందితులు వాటిని ముందుగానే డిలీట్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

దీంతో నిందితుల నుంచి స్వాధీన చేసుకున్న మొబైల్ ఫోన్లను డేటా రికవరీ కోసం పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. దీంతో హోం మంత్రి మహమూద్ అలీ సీరియస్ అయి.. కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు కేసు దర్యాప్తును తాజాగా ఏసీపీ శ్రీదేవికి అప్పగించారు.

చదవండి: వీడు మనిషేనా?: ‘‘ఫోన్ చేస్తే మాట్లాడాలి.. పిలిచినప్పుడల్లా వచ్చి నా కోరిక తీర్చాలి.. లేదంటే..’’

చదవండి: దారుణం: కూతురిపై తండ్రి, బాబాయ్‌లే.. మూడేళ్లుగా అదే తంతు.. తెలిసినా మిన్నకుండిపోయిన తల్లి!

చదవండి: దారుణం: ఇంజనీరింగ్ విద్యార్థినిపై అన్నయ్య స్నేహితుడే.. మరో ఐదుగురితో కలిసి రెండ్రోజులపాటు…

 

 

- Advertisement -