ఛీ..ఛీ.. వీడసలు తండ్రేనా? కన్న కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం.., భార్య ఫిర్యాదుతో కటకటాల్లోకి…

Bihar-shelter-home-rapes
- Advertisement -

Bihar-shelter-home-rapes

హైదరాబాద్: కంటికి రెప్పలా కాపాడల్సిన తండ్రే మృగంలా మారాడు.  కన్న కూతురు అని కూడా చూడకుండా మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.  ఈ మానవ మృగాన్ని చివరికి పోలీసులు అరెస్టు చేశారు.  ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే లైంగిక దాడి చేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ బాలిక అయోమయనికి గురైంది. కూతురి ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి ప్రశ్నించాగా ఈ దారుణం వెలుగు చూసింది.

పోలీసుల కథనం ప్రకారం… రెయిన్‌బజార్‌ పోలీస్స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఓ వ్యక్తి(38) పనీ పాట లేకుండా భార్య సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. భార్య పనికి వెళ్లిపోవడంతో ఇంటి వద్ద ఖాళీగా ఉండే అతడి కళ్లు సొంత కూతురిపై పడ్డాయి.  భార్య ఇంట్లో లేని సమయం చూసుకుని.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తె (17)పై అత్యాచారం చేశాడు.

అంతేకాదు, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూతురిని బెదిరించాడు. ఇలా బెదిరిస్తూ మూడు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. కూతురి ప్రవర్తనపై తల్లికి అనుమానం వచ్చింది.  ఆమెను ప్రశ్నించగా.. జరిగిన విషయం అంతా తల్లికి చెప్పేసింది. దీంతో ఆ మాతృమూర్తి నేరుగా పోలీసులను ఆశ్రయించింది.  దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడైన ఆమె భర్తను అరెస్టు చేశారు.

- Advertisement -