- Advertisement -
నెల్లూరు : నగరంలో శనివారం ఓ కారు బీభత్సం సృష్టించింది. పెట్రోల్ బంకులోనుంచి వేగంగా వచ్చిన ఆ కారు జనంపైకి దూసుకెళ్లటంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నెల్లూరు నగరంలోని బొల్లినేని ఆసుపత్రి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
అంతేకాదు, ఆ కారు అంతటితో ఆగకుండా అక్కడ ఆగి ఉన్న ఆటోలపైకి, బైకులపైకి దూసుకెళ్లి మరింత బీభత్సం సృష్టించింది. సంఘటన జరిగిన సమయంలో జనం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. కారును వేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -