ముంబై: ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ కేసులో బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. నృత్య ప్రదర్శనల పేరిట అమ్మాయిలను విదేశాలకు తీసుకెళ్లి, అక్కడ వారితో వ్యభిచారం చేయిస్తున్న బాలీవుడ్ నృత్య దర్శకురాలు ఆగ్నెస్ హామిల్టన్ (56) గుట్టును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు.
అంధేరీలోని లోఖండ్ వాలా సమీపంలో బాలీవుడ్ హబ్ పేరిట నృత్య శిక్షణ తరగతులను నిర్వహించే అగ్నేస్ హమిల్టన్.. పలు బాలీవుడ్ సినిమాలకు కోరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మలేసియా తదితర దేశాల మధ్య తరచూ తిరుగుతున్న ఈమె, ఇక్కడి నుంచి కొందరు అమ్మాయిలను డాన్స్ పెర్ఫార్మన్స్ అని చెప్పి నమ్మించి విదేశాలకు పంపించి అక్కడ వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.
కెన్యాలో తీగ లాగితే…
ఇటీవల కెన్యాలోని ఓ హోటల్‌లో నృత్య ప్రదర్శనకు వచ్చిన యువతి వ్యభిచారం చేస్తుంటే, అక్కడి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారించగా బాలీవుడ్‌కు చెందిన హామిల్టన్ పేరు బయటికొచ్చింది. నైరోబీకి పంపించిన వారు ఇక్కడ తనను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశారని ఆ యువతి తెలిపింది.
సదరు యువతి కూడా హమిల్టన్ డాన్స్ క్లాస్‌లో గత ఏడాది జాయిన్ అయిందని సమాచారం. ఆ రకంగా ఆమె ఈ ఉచ్చులో ఇరుక్కుంది. ఒక్కొక్కరి నుంచి రూ. 40 వేలు తీసుకుంటున్న అగ్నెస్, వారిని కెన్యా, బహ్రెయిన్, దుబాయ్ తదితర దేశాలకు పంపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
కొన్నేళ్లుగా ఈ వ్యభిచారం రాకెట్ నడుస్తుందని, హామిల్టన్ ఇండియా నుండి మలేసియాకి అమ్మాయిలను ఎక్కువగా వ్యభిచారం కోసం పంపిస్తుండేదని పోలీసులు వెల్లడించారు. హామిల్టన్ ఫేస్ బుక్ ప్రోఫైల్స్ లో కొందరు హీరోలు, రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు కనిపించడం గమనార్హం. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఆగ్నెస్ హామిల్టన్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు.