22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home క్రైమ్ దారుణం: ఇంజనీరింగ్ విద్యార్థినిపై అన్నయ్య స్నేహితుడే.. మరో ఐదుగురితో కలిసి రెండ్రోజులపాటు…

దారుణం: ఇంజనీరింగ్ విద్యార్థినిపై అన్నయ్య స్నేహితుడే.. మరో ఐదుగురితో కలిసి రెండ్రోజులపాటు…

gang-rape-on-engineering-student
- Advertisement -

gang-rape-on-engineering-student

భువనేశ్వర్: ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని(20)పై ఆమె అన్నయ్య స్నేహితుడే దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను కిడ్నాప్ చేసి.. మరో ఐదుగురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండ్రోజులపాటు ఆ యువతికి నరకం చూపాడు. అనంతరం ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధిత యువతి నేరుగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

చదవండి: దారుణం: దేశ రాజధానిలో సామూహిక అత్యాచారం! ఆటోలో ఎక్కిన మహిళను బలవంతంగా.. గదికి తీసుకెళ్లి…

వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలాకు చెందిన ఆ విద్యార్థిని గత ఏడాది డిసెంబర్ 30న ఇంటికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లో రైలు కోసం నిరీక్షిస్తోంది. అంతలో ఆమె అన్నయ్య స్నేహితుడు కనిపించాడు. ఆమెను నమ్మించి ఇంటికెళ్లే రైలు కాకుండా మరో రైలు ఎక్కించాడు. తీరా ఎక్కేశాక ఆమె ఆ విషయం గమనించి అతడ్ని నిలదీసింది.

స్టేషన్‌లో దిగేసి.. బస్సులో ఇంటికెళ్దామంటూ…

దీంతో అతడు మాట మార్చేశాడు. కంగారుపడొద్దని.. వచ్చే స్టేషన్‌లో దిగేసి.. బస్సులో ఇంటికెళ్దామంటూ ఆమెకు నచ్చజెప్పాడు. జార్ఖండ్‌లోని లోథ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో దిగగానే బస్టాండ్ వైపు అంటూ.. ఆమెను చక్రధార్‌పూర్‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే మరో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. అలా వారంతా ఆ యువతిపై రెండ్రోజులపాటు సామూహిక అత్యాచారం చేశారు.

అనంతరం ఆ విద్యార్థినిని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో వదిలేసి వారు పరారయ్యారు. దీంతో ఆమె స్థానికుల సహాయంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రూర్కెలా రైల్వే ఎస్పీ అజయ్ ప్రతాప్ స్వయిన్మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, నిందితులను ఇంకా తాము అరెస్టు చేయలేదని చెప్పారు.

 

 

- Advertisement -