
- Advertisement -

రాయగడ : మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో ఓ బాలుడికి తీవ్ర గాయలు అయ్యాయి.. ఈ సంఘటన రాయగడ జిల్లాలోని కాశీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తొలొజొరి గ్రామ పంచాయతీలోని మొంకొడొ గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే… మొంకొడొ గ్రామానికి చెందిన కునమజ్జి కుమారుడు సునాసింగ్ (8) గ్రామంలో ఆరుబయట ఆడుకుంటూ పని చేయక పారేసిన మోబైల్ ఫోన్ బ్యాటరీని కాలితో తన్నుకుంటూ వెళ్లి ఒక ప్రాంతంలో ఆ బ్యాటరీని రాయితో కొట్టగా హఠాత్తుగా ఆ బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో సునాసింగ్ తీవ్రంగా గాయపడ్డాడు.
సునాసింగ్ తల, చేయి, తొడలకు తీవ్రమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ బాలుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయాల పాలైన బాలుడికి తొలుత కాశీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి అనంతరం 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -








