ముంబై: సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్ నాథ్‌పై ముంబై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. నటుడు అలోక్ నాథ్ తనపై అత్యాచారం చేశాడంటూ.. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా… నిర్మాత వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే వింటా నందా చేపిన ఆరోపణలను అలోక్ నాథ్ ఖండిచడమే కాక ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఇలాంటి సమయంలో పోలీసులు తనపై రేప్ కేస్ నమోదు చేయడం అలోక్ నాథ్‌కి.. ఉహించని షాక్. నిర్మాత వింటా నందా ఫిర్యాదు మేరకు నటుడు అలోక్ నాథ్‌పై ఓషివారాకు చెందిన పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి మనోజ్ శర్మ మీడియాకి వెల్లడించారు.
ఈ క్రమంలో అలోక్ నాథ్‌కు వ్యతిరేకంగా వింటా నందా మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ అతని భార్య గతంలో సెషన్స్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టేసింది. వింటా నందా ఆరోపణల తర్వాత, అలోక్ నాథ్ తమను కూడా లైంగికంగా వేధించాడంటూ పలువురు మహిళలు ఆరోపించారు.
దాంతో అలోక్ నాథ్ వింటా నందాపై పరువు నష్టం దావా వేయడంతో పాటు లిఖితపూర్వక క్షమాపణతో ఇంకా పరిహారంగా రూ.1 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ పంపిన నోటీసుపై కూడా అలోక్ స్పందించలేదు. అలాగే అలోక్ నాథ్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఐఎన్‌టీఏఏ (సినీ, టీవీ ఆర్టిస్ట్‌ల సంఘం) ఆయన్ని తమ అసోసియేషన్ నుంచి కూడా బహిష్కరించింది.