ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి మల్టీ స్టారర్ మూవీలో… అతడేనా విలన్…?

kannada star hero yash act as a villain in Rajamouli rrr
- Advertisement -

kannada star hero yash act as a villain in Rajamouli rrr

హైదరాబాద్: ఎంతగానో ఎదురు చూసిన దర్శకధీరుడు రాజమౌళి మల్టీస్టారర్ షూటింగ్ ఎట్టకేలకు స్టార్ట్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ప్రధాన పాత్రల కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ స్టార్ హీరోలే. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికీ కూడా ఒక రేంజ్‌లో క్రేజ్ వుంది.

మరి ఈ చిత్రంలో హీరోయిన్లు ఎవరు? అంటే… ఒక కథానాయికగా కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది.  మరి అంతటి స్టార్ హీరోలకు దీటైన ప్రతి కథానాయకుడు ఎవరు?  అలాంటి హీరోలతో ఈ సినిమాలో తలపడే విలన్ ఎవరై వుంటారా.. అనే విషయమే ఇప్పుడు ఆసక్తికరంగా.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఆ విలన్.. కన్నడ రాకింగ్ స్టార్…

ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో ‘యష్’ పేరు తెరపైకి వచ్చింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఈ చిత్రంలో విలన్‌గా నటించనున్నాడనే వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో కన్నడ సినిమాల్లో ‘యష్’ స్టార్ స్టేటస్‌ను అందుకున్నాడు. మంచి ఫిజిక్ .. విలక్షణమైన నటనతో ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

ఈ యంగ్ హీరో తన చిత్రాలతో కన్నడ ప్రేక్షకుల్లో భారీగా అభిమానాన్ని సంపాదించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. యష్‌ను విలన్‌గా తీసుకుంటే మాత్రం.. ఈ సినిమాకు ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే యష్‌ను ఈ  సినిమాలో విలన్ గా తీసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఫిల్మ్ నగర్‌లో ఒక టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి. ‘యష్’ తాజా చిత్రం ‘కేజీఎఫ్’ వచ్చేనెల 21వ తేదీన తెలుగులోనూ విడుదలకానుంది.

- Advertisement -