29.2 C
Hyderabad
Saturday, August 29, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ షూటింగ్‌కి సిద్ధమైన తారక్, చరణ్…

షూటింగ్‌కి సిద్ధమైన తారక్, చరణ్…

- Advertisement -

హైదరాబాద్: బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఇందులో తెలుగు అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తున్నారు. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా…. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు.

అయితే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ షూటింగు జరుగుతూ ఉండగా, జిమ్ లో చరణ్ కాలు బెణకడం .. ఆ తరువాత ఎన్టీఆర్ చేతికి గాయం కావడం జరిగింది.

దాంతో ఈ సినిమా షూటింగుకి కొన్ని రోజుల పాటు విరామాన్ని ప్రకటించారు. ఇక ఇద్దరి గాయాలు తగ్గడంతో… తారక్, చరణ్‌లు షూటింగ్‌కి సిద్ధమవుతున్నారు. మూడో షెడ్యూల్‌లో భాగంగా  హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ .. చరణ్ .. అలియా భట్ తదితరులు ఈ షూటింగులో పాల్గొననున్నట్టు సమాచారం. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం …జూలై 30 2020లో విడుదల కానుంది.

చదవండి: మళ్ళీ హిట్ కాంబినేషన్ రిపీట్: తారక్-త్రివిక్రమ్ కొత్త సినిమా?
- Advertisement -