
అనంతపురం: కౌంటింగ్ కోసం ఈసీ చేసిన ఏర్పాట్లు చాలా అధ్వానంగా ఉన్నాయని ఉరవకొండ టీడీపీ అభ్యర్ధి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉరవకొండలో కౌంటింగ్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందనీ చెప్పారు.
ఇక ఒక్కో టేబుల్ వద్ద 16 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారన్నారు. ఇలా ఒక్క కౌంటింగ్ కేంద్రంలో 200 మంది ఉండాలన్నారు. కానీ ఇప్పుడు ఏర్పాటుచేసిన కేంద్రంలో కనీసం 4-5 ఉండటానికి కూడా వీలు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు కనీసం ఏజెంట్లు పక్కకు వెళ్లేందుకు కూడా అవకాశం లేదనీ, దీనివల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికైనా కౌంటింగ్ హాల్ సామర్థ్యం పెంచాలని, తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు.
ఇక ఏపీలో ఈసారి కూడా 2014 నాటి ఫలితాలే పునరావృతం అవుతాయని, అప్పట్లో కూడా జగనే గెలుస్తాడని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయనీ, కానీ ప్రజలు మాత్రం టీడీపీకే పట్టం కట్టారని గుర్తుచేశారు.








