
హిందూపురం: దివంగత ఎన్టీఆర్ వారసుడిగా సినిమా రంగంలో అడుగుపెట్టి అగ్రనటుడుగా ఎదిగిన నందమూరి బాలకృష్ణ…. 2014లో తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. తెలుగుదేశం అభ్యర్ధిగా తమ కంచుకోట హిందూపురంలో పోటీ చేసి సుమారు 16 వేల ఓట్ల పైనే మెజారిటీతో వైసీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు.
ఇక ఈసారి జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన హిందూపురం నుంచే పోటీ చేశారు. ఈయనపై వైసీపీ తరుపున మహ్మద్ ఇక్బాల్ బరిలో దిగారు. అయితే 2014లో గెలిచిన బాలయ్యకి ఎన్నికల ఫలితాల రోజు ఒక ఓ సెంటిమెంట్ ఉందంటా.
చదవండి: అక్కడ నీ వల్ల పందేలు కాసి సర్వ నాశనం అయిపోయారు: లగడపాటిపై మంత్రి అయ్యన్న…
2014లో ఓట్ల లెక్కింపు సమయంలో అనంతపురం ఎస్కే యూనివర్సిటీ ఆర్టీటీ స్టేడియంలోని 9వ నంబర్ గదిలో బాలకృష్ణ బస చేసి, కౌంటింగ్ సరళిని పరిశీలించారు. ఇక ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం జరిగింది.
దీంతో ఈ ఎన్నికల్లో కూడా అదే గదిలో ఉండి ఎన్నికల సరళిని పరిశీలించాలని అనుకుంటున్నారు. అందులోనే బస చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే ఆ గదిని మరొకరికి కేటాయించిన అధికారులు, బాలయ్య కోరిక మేరకు దాన్ని ఖాళీ చేయించారు. ఈ సాయంత్రం నుంచి బాలయ్య ఇదే గదిలో బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.








