చెన్నై: తమిళ హీరో సూర్యకి క్రికెటర్ సురేశ్ రైనా ఊహించని స్వీట్ షాక్ ఇచ్చాడు. హీరో సూర్య తన కొత్త చిత్రం ‘ఎన్.జీ.కే’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో భాగంగా సూర్య… తన అభిమానులతో ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ నిర్వహించాడు.
ఈ క్రమంలోనే ఓ అభిమానిగా సురేశ్ రైనా కూడా సూర్యకి ఓ ప్రశ్న సంధించాడు. “మీకు చెన్నై సూపర్ కింగ్స్ లో ఏ క్రికెటర్ అంటే ఇష్టం?” అని ప్రశ్నించాడు.
అయితే హఠాత్తుగా రైనా స్పందించడంపై సూర్య షాక్ తిన్నాడు. రైనా అలా ట్విట్టర్ లోకి రావడాన్ని మొదట నమ్మలేకపోయిన సూర్య, ఆపై జవాబు చెప్పాడు.
“మీకు నాతో మాట్లాడటానికి సమయం దొరికిందా? నేను నమ్మలేకపోతున్నాను. మీ పాప గ్రేసియాతో పాటు అందరినీ అడిగానని చెప్పండి. నాకు చెన్నై సూపర్‌కింగ్స్‌లో ధోని అంటే చాలా ఇష్టం. నేను కావాలనే చెప్పలేదు. నేను ఎప్పటికీ సూర్‌కింగ్స్ అభిమానినే. సూపర్‌కింగ్స్‌లో నేను కలిసిన తొలి ఆటగాడు ధోని. ఆ సమయంలో మీరు నాకు హలో చెప్పడం ముచ్చటేసింది. మన ఇద్దరం కలిసి దిగిన ఫోటను నేను ఎప్పటికీ భద్రంగా దాచుకుంటాను“ అని రైనా ప్రశ్నకు హీరో సూర్య సమాధానం ఇచ్చారు.
కాగా, సూర్య నటించిన ‘ఎన్‌జికే’ ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతుంది.








