26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం సుమలత చేతిలో సీఎం కుమారుడు ఓడిపోతాడా?

సుమలత చేతిలో సీఎం కుమారుడు ఓడిపోతాడా?

- Advertisement -

బెంగళూరు: ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో గట్టి టఫ్ ఫైట్ జరిగిన స్థానాల్లో కర్నాటకలోని మాండ్యా పార్లమెంట్ స్థానం ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ మద్ధతుతో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు,  కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ జేడీఎస్ నుంచి బరిలో దిగారు.

అదే సమయంలో ప్రముఖ నటుడు కాంగ్రెస్ నేత అంబరీష్ మరణంతో ఆయన భార్య సుమలత కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలనుకుంది. కానీ కాంగ్రెస్ ఈ సీటు మిత్రపక్షం జేడీఎస్‌కు కేటాయించింది. దీంతో సుమలత ఇండిపెండెంట్‌గా బరిలో దిగింది. సుమలత బరిలో ఉండటంతో బీజేపీ కూడా పోటీ పెట్టలేదు.

దీంతో సుమలత, నిఖిల్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. వీళ్లిద్దరు కూడా ఈ ఎన్నికల్లోనే రాజకీయ రంగ ప్రవేశం చేయడం కొసమెరుపు. అయితే తాజాగా మాండ్యా లోక్‌సభ స్థానంపై వివిధ సంస్థలు వెల్లడించిన సర్వేలు కాంగ్రెస్,జేడీఎస్ శ్రేణులను నిద్రలేకుండా చేస్తున్నాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ స్థానం నుంచి సుమలత గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి.

చదవండి: రాహుల్, ప్రియాంకలు కష్టపడ్డారు…ప్రతిపక్ష హోదాకి కావల్సిన సీట్లు వారికి వస్తాయి: శివసేన  

ముఖ్యంగా ఇక్కడ సుమలతకు బీజేపీ మద్ధతు ఇవ్వడం, అలాగే మహిళలు, మైనార్టీ వర్గాలకు చెందిన ఓట్లు సుమలతకు అనుకూలంగా పడ్డాయని పలు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఇక మొన్న వచ్చిన ఎగ్జిట్ ఫలితాల్లో కూడా సుమలత గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాయి. ఇక ఇక్కడ ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

చదవండి: వైసీపీ అధికారంలోకి వస్తే.. ఆర్ధిక శాఖ విజయసాయి రెడ్డికేనా?
- Advertisement -