ముంబై లీలావతి ఆసుపత్రిలో సంజయ్ దత్‌!.. ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటూ వార్తలు.. నిజమేనా?

sanjay-dutt-admitted-in-hospital-is-he-diagnosed-with-lung-cancer
- Advertisement -

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో గత కొన్ని రోజులుగా ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆగస్టు 8న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది దాంతోపాటు ఛాతీలో నొప్పి రావడంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనుమానంతో వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. 

ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరింత మెరుగైన వైద్యం కోసం సంజయ్ అమెరికాకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. 

ప్రస్తుతం సంజయ్ దత్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చిత్రంతోపాటుగా ‘శమ్‌షేరా’ చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే ఆయన నటించిన ‘సడక్ 2’, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. 

అయితే తన ఆరోగ్యానికి సంబంధించి మంగళవారం సంజయ్ దత్ ఓ ట్వీట్ చేశారు. తన పనికి కొంత బ్రేక్ ఇచ్చినట్లు, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. 

తన ఆరోగ్యంపై వస్తోన్న పుకార్లను ఎవరూ నమ్మరాదని కోరారు. అందరి అభిమానం, ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుని తిరిగి వస్తానని ఆ ట్వీట్‌లో సంజయ్ దత్ పేర్కొన్నారు. 

మరోవైపు సంజయ్ దత్ ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే ఆయన అభిమానులతోపాటు పలువురు సెలబ్రిటీలు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

 

 

- Advertisement -