
హైదరాబాద్: తమిళంలో ఇంతకుముందు తమన్నా ప్రధాన పాత్రధారిగా ‘దేవి’ అనే హారర్ థ్రిల్లర్ సినిమా నిర్మితమైంది. తెలుగులో ఈ సినిమా ‘అభినేత్రి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భాషల్లోనే కాకుండా ఈ సినిమా హిందీలోనూ సక్సెస్ అయింది.
దాంతో దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ సినిమాకి సీక్వెల్ చేశాడు. ‘అభినేత్రి 2’ పేరుతో ఈ సినిమా రూపొందింది. ఈసారి ఈ సినిమాలో తమన్నాతో పాటు నందిత శ్వేత కనిపించనుండటం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు.
చదవండి: 2 కోట్ల ఆఫర్ ను వద్దన్న సాయి పల్లవి!
ప్రభుదేవా .. తమన్నా .. నందిత శ్వేత .. కోవై సరళకి సంబంధించిన ఆసక్తికరమైన సన్నివేశాలపై ఈ టీజర్‌ను కట్ చేశారు. తమన్నాతోపాటు ప్రభుదేవా కూడా ఈ సినిమాలో దెయ్యంగా కనిపించనున్నట్టు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.
‘ఒక దెయ్యం కాదయ్యా .. రెండు దెయ్యాలు’ అని కోవై సరళ చెప్పడం, ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొదటిభాగానికి మించిన విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.








