29.2 C
Hyderabad
Saturday, August 29, 2026
- Advertisement -
Home క్రీడలు కబడ్డీ ప్రొ కబడ్డీ లీగ్‌: ఇరగదీసిన రాహుల్‌ చౌదరి.. తెలుగు టైటాన్స్‌కు మరో విజయం..

ప్రొ కబడ్డీ లీగ్‌: ఇరగదీసిన రాహుల్‌ చౌదరి.. తెలుగు టైటాన్స్‌కు మరో విజయం..

telugu titans patna pirates2
- Advertisement -

telugu titans patna pirates2

పాట్నా: తెలుగు టైటాన్స్ స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి 18 పాయింట్లతో అదరగొట్టడంతో ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్-6లో  తెలుగు టైటాన్స్‌ అద్భుతమైన  గెలుపును నమోదు చేసింది.  మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 53-32 స్కోరుతో పాట్నా పైరేట్స్‌ను చిత్తుగా ఓడించింది.

తెలుగు టైటాన్స్ కెప్టెన్‌ విశాల్‌ భరద్వాజ్‌ 9 ట్యాకిల్‌ పాయింట్లతో రాణించాడు. ఆరంభంలోనే  పాట్నా పైరేట్స్ స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్‌ను పట్టేసి.. తెలుగు టైటాన్స్‌ తన ఖాతా తెరిచింది. ఆ తర్వాత పాట్నా పైరేట్స్ పుంజుకుంది.

ఫస్టాఫ్‌లో 10 నిమిషాల ఆట ముగిసేసరికి తెలుగు టైటాన్స్‌ 8-9 స్కోరుతో వెనుకంజలో నిలిచింది. కానీ,  రాహుల్‌, నీలేష్‌.. వరుసగా పాయింట్లు తేవడంతో ఆట 15వ నిమిషానికి తెలుగు టైటాన్స్‌ 19-10 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది.

ఆ తరువాత తెలుగు టైటాన్స్ జట్టు ఆటగాళ్లకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.   25-17 స్కోరుతో టైటాన్స్ ఆట మొదటి అర్ధభాగాన్ని ముగించింది.

ఇక సెకెండాఫ్‌ ఆరంభంలోనే రాహుల్‌  చౌదరి సూపర్‌ రైడ్‌తో తెలుగు టైటాన్స్ మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 10 నిమిషాల ఆట ముగిసేసరికి 40-24తో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. అసలు ఆట మొత్తం మీద ఎక్కడ కూడా ప్రత్యర్థి  జట్టుకు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ పై పట్టు బిగించిన తెలుగు టైటాన్స్‌ అదే జోరును ప్రదర్శిస్తూ.. చివరికి 46-29 స్కోరుతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

మరో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్‌పై 37-27 స్కోరుతో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ గెలుపొందింది.

- Advertisement -