యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు.. ఇప్పుడు మెడకు చుట్టుకున్న రెండేళ్లనాటి ప్రోగ్రాం..

case filed on anchor srimukhi by banjarahills police
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నల్లకుంటకు చెందిన వెంకటరమణ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి: ప్రపంచ నవ్వుల దినోత్సవం.. సూపర్ స్టార్ మహేశ్‌బాబు వీడియో వైరల్

జెమినీ టీవీలో ప్రసారమైన కామెడీ షో ‘జూలకటక’ లో బ్రాహ్మణులను కించపరిచేలా  దృశ్యాలను చిత్రీకరించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 శ్రీముఖితో పాటు, జెమిని టీవీ యాజమాన్యంపైనా శర్మ పోలీసుకు ఫిర్యాదు చేశారు. నిజానికి ‘జూలకటక’ అనేది రెండేళ్ల క్రితం నాటి  ప్రోగ్రాం.

అయితే అప్పట్లో ఈ షో అంత పాపులర్ కాలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్ సమయంలో దీనిని పునఃప్రసారం చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. బుల్లితెర రాములమ్మగా పేరుగాంచిన ఈమె యాంకర్‌గా మాత్రమే కాకుండా నటిగానూ మెప్పించారు.

ప్రస్తుతం శ్రీముఖికి ఒక హీరోయిన్‌కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. గతేడాది బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొనడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.

చదవండి: సినీనటి తారా చౌదరి సంచలనం.. తన భర్తపై పామూరు ఎస్సై దాడి చేశాడంటూ…

అందుకే, ఇప్పుడు శ్రీముఖిపై పోలీసు కేసు అనగానే.. ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. రెండేళ్ల క్రితం తీసిన కామెడీ షోకు సంబంధించి ఇప్పుడు కేసు నమోదు కావడం గమనార్హం.

మరి ఈ విషయమై ఇటు శ్రీముఖి, అటు జెమిని టీవీ యాజమాన్యం ఎలా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

- Advertisement -