హైదరాబాద్: వర్థమాన టీవీ యాంకర్, బుల్లితెర నటి శాంతి (అసలు పేరు విశ్వశాంతి) అనుమానాస్పద స్థితిలో మరణించారు. విశాఖపట్టణానికి చెందిన ఈమె గురువారం హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఎల్లారెడ్డిగూడ ఇంజనీర్స్ కాలనీలోని తన నివాసంలో శవమై కనిపించారు.
చదవండి: తంగడపల్లి వివాహిత హత్య కేసు.. నడుస్తున్న కారులో అత్యాచారం, హత్య!
ఈ మేరకు సమాచారం అందగానే ఎస్సార్ నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. శాంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె గురించి, ఆమె మరణానికి కారణాలు ఏమై ఉండొచ్చనే విషయాలను చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు.
మొబైల్ ఫోన్ స్వాధీనం…
శాంతి నివాసంలోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆమె మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడంతోపాటు సీసీ టీవీ ఫుటేజిని కూడా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, ఆమెది ఆత్మహత్యా? లేక ఎవరైనా ఆమెను హత్య చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
చదవండి: కరోనా వేళ కలకలం.. ప్రియుడితో కలిసి భర్తను లారీతో గుద్దించి చంపిన భార్య!
విశాఖపట్టణానికి చెందిన శాంతి పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. మరోవైపు శాంతి మృతిపై బుల్లితెరకు చెందిన పలువురు నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కేసులో దర్యాప్తు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరింత ముందుకు సాగవచ్చనే ఆశాభావాన్ని పోలీసులు వ్యక్తం చేశారు.