
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో 549 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు దేశంలో 166 మంది మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక, దేశవ్యాప్తంగా నమోదైన కరోనా నిర్దారిత కేసుల సంఖ్య 5734కు చేరిందని అగర్వాల్ తెలిపారు. వైరస్ బారినపడిన 473 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయినట్టు చెప్పారు.
పీపీఈ కిట్లు, మాస్కులు, వెంటిలేటర్లను ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని లవ్ అగర్వాల్ తెలిపారు. దేశం 20 కంపెనీలు పీపీఈ కిట్లను తయారు చేస్తున్నాయని అగర్వాల్ పేర్కొన్నారు.
1.7 కోట్ల పీపీఈ కిట్లకు, 49 వేల వెంటిలేటర్లకు ఆర్డర్స్ ఇచ్చామన్నారు. రైల్వే విభాగంలో 2,500 మంది డాక్టర్లు, 35 వేల పారామెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఇండియన్ రైల్వేస్‌లో 80 వేల ఐసోలేషన్ బెడ్లను ఏర్పాటు చేసినట్లు లవ్ అగర్వాల్ వివరించారు.








