25.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ షాకింగ్: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నటుడు శివాజీ రాజా! అసలేం జరిగింది?

షాకింగ్: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నటుడు శివాజీ రాజా! అసలేం జరిగింది?

- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా (58) ఆసుపత్రి పాలయ్యారు.  మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఆయన గుండెపోటుకు గురై కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు స్టార్ హాస్పిటల్‌కు తరలించారు.

చదవండి: యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు.. ఇప్పుడు మెడకు చుట్టుకున్న రెండేళ్లనాటి ప్రోగ్రాం..

ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బీపీ డౌన్ కావడంతో శివాజీ రాజాకు గుండెపోటు వచ్చిందని ఆయన స్నేహితుడు, నిర్మాత సురేష్ కొండేటి వెల్లడించారు.

శివాజీరాజాకు స్టంట్ వేయాలని వైద్యులు నిర్ణయించారని తెలిపారు.  శివాజీరాజా 400కు పైగా సినిమాల్లో నటించారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై…

పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. ‘అమృతం’, ‘ఆలస్యం అమృతం విషం’, ‘మిస్టర్ రోమియో’, ‘పండు మిరపకాయ్’, ‘పాపం పద్మనాభం’, ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
 
ఇటీవల కాలంలో  ‘శ్రీమంతుడు’, ‘నక్షత్రం’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘మెంటల్ మదిలో’, ‘జై సింహా’, ‘ఎంఎల్ఏ’, ‘అమ్మమ్మగారిల్లు’, ‘నర్తనశాల’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల్లో శివాజీ రాజా నటించారు.
 
క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాలుగు నంది అవార్డులు అందుకున్నారు. 2017లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా శివాజీ రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.
చదవండి: నా వీడియోలు ట్రోల్ చేస్తున్నారు: పోలీసులకు కమెడియన్ పృథ్వీ ఫిర్యాదు
 
- Advertisement -