34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home క్రీడలు కబడ్డీ ప్రో కబడ్డీ లీగ్: రెండో మ్యాచ్‌లోనూ యు ముంబా విజయం.. భార్య, కుమార్తెలతో కలిసి మ్యాచ్‌ను...

ప్రో కబడ్డీ లీగ్: రెండో మ్యాచ్‌లోనూ యు ముంబా విజయం.. భార్య, కుమార్తెలతో కలిసి మ్యాచ్‌ను తిలకించిన అభిషేక్ బచ్చన్…

- Advertisement -

చైన్నై: ప్రో కబడ్డీ లీగ్‌లో యు ముంబా జట్టు రెండో మ్యాచ్‌లోనూ సంచలన విజయం సాధించింది. బుధవారం నాటి ఆటలో 39-32 స్కోరుతో జైపూర్‌ పింక్ పాంథర్స్‌ను కంగుతినిపించి విజయన్ని అందుకుంది. యు ముంబా రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 13 పాయింట్లతో అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర  పోషించాడు.

నిజానికి చివరి ఐదు నిమిషాల వరకు జైపూర్‌ పింక్ పాంథర్స్‌ జట్టుదే విజయమని అంతా అనుకున్నారు. కానీ చివర్లో యు ముంబా ఆటగాళ్ళు విజృంభించి ఆడాడంతో 39-32తో ఆ జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది. రోహిత్ బలియాన్ 7 పాయింట్లు సాధించాడు. పింక్ పాంథర్స్ జట్టులో నితిన్ ఒక్కడే 8 పాయింట్లతో రాణించాడు. అనూప్ 4 పాయిట్లు, మోహిత్, సుదీప్ ధుల్, అమిత్‌లు తలో 3 పాయింట్లు సాధించారు.

కుమార్తెలతో కలిసి మ్యాచ్‌ను తిలకించిన ఐశ్వర్య అభిషేక్..

ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన యు ముంబా- జైపూర్‌ పింక్ పాంథర్స్ మ్యాచ్‌ను జైపూర్ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్.. తన సతీమణి ఐశ్వర్యరాయ్, కుమార్తెలతో కలిసి ఆసక్తిగా తిలకించారు.

aishwarya rai with his daughter

బెంగళూరు బుల్స్‌పై తమిల్ తలైవాస్ విజయం..

జోన్ -బి లో జరిగిన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 48-37 స్కోరుతో తమిళ్ తలైవాస్‌ పై విజయం సాధించింది. పవన్ 20 పాయింట్లతో బెంగళారు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాశీలింగ్ అడికె 9 పాయింట్లు సాధించాడు.  అటు తమిళ్ తలైవాస్ జట్టులో కూడా అజయ్ ఠాకూర్ 20 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు.

 

- Advertisement -