ప్రియురాలి కోసం దొంగగా మారిన సాప్ట్‌వేర్ ఇంజినీరు…

arrest
- Advertisement -

arrest

న్యూఢిల్లీ: ప్రియురాలి కోసం ఓ సాప్ట్‌వేర్ ఇంజినీరు దొంగతనాల బాట పట్టిన సంఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. హర్యానాలోని అంబాలా పట్టణానికి చెందిన గర్విత్ సాహ్ని బీటెక్ చదివి న్యూఢిల్లీలో సాప్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. తన ప్రియురాలికి అర్థికంగా సాయం చేసేందుకు దొంగ అవతారం ఎత్తాడు.

ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఓ సదస్సు జరగ్గా, అందులో పాల్గొనేందుకు వచ్చిన వ్యక్తి బ్యాగులోనుంచి రూ.10 వేలు దొంగతనం చేశాడు.  ఇదంతా సీసీ టీవీ కెమెరాలో రికార్డు కావడంలో పోలీసులు నిందితుడైన పాహ్నీని గుర్తించి అరెస్టు చేశారు. అర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తన ప్రియురాలి కోసమే దొంగతనం చేశానని సాహ్నీపోలీసుల ఎదుట అంగీకరించాడు కూడా.

ఎంత ప్రియురాలి కోసమైతే మాత్రం.. సాప్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తూ.. ఈ పాడు పని ఏమిటో…?

- Advertisement -