సీఎం చంద్రబాబు అద్భుతమైన నటుడు.., మంత్రి జవహర్‌తో ఎందుకు?: పవన్ కల్యాణ్

pawan-kalyan-chandra-babu
- Advertisement -

babu-lokesh-pawan

పశ్చిమగోదావరి: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తాము మొదటి నుంచి పోరాడుతున్నామని,  ఇప్పటికీ హోదా కావాలనే మాట మీదనే తాము నిలబడి ఉన్నామని, కానీ ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చింది ముఖ్యమంత్రి చంద్రబాబేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.  బుధవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాారు.

‘మన ముఖ్యమంత్రి అద్భుతమైన నటుడు. ఆయన అన్న మాటలు ఆయనే మర్చిపోతుంటారు. ‘స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దని నేను చెప్పలేదు…’ అని ఆయన (చంద్రబాబు) అంటారు. పోనీ.. ఆయన అన్న మాటలు రికార్డు చేసి ఆయనకే చూపించినా..  ‘ఎవరో అన్నారు నేను కాదు..’ అనే ఆయన అంటారు’ అంటూ పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

వాళ్లు తిట్టరు.. వేరే వాళ్లతో తిట్టిస్తారు…

ఒక మంత్రినిగానీ, ఎమ్మెల్యేనుగానీ తాను వేలెత్తి చూపిస్తే ఆ మర్నాడు సీఎం చంద్రబాబుగానీ, ఆయన తనయుడు లోకేశ్‌గానీ తనను తిట్టరని, తన కులానికే చెందిన గంటా శ్రీనివాసరావుతోనో, లేకపోతే కళా వెంకట్రావుతోనో తనను తిట్టిస్తారని  పవన్ కల్యాణ్ చెప్పారు.

చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ కూడా.. ‘ఆయనంటే మాకు చాలా ఇష్టం..’ అని మాట్లాడతారు. కానీ నేను ఏ కులం నుంచి వచ్చానో ఆ కులం వారితో నన్ను తిట్టిస్తారు. లేదంటే.. ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయా వ్యక్తుల చేత తిట్టిస్తారని ఆయన పేర్కొన్నారు.

మంత్రి జవహర్‌గారితో ఎందుకు?

‘‘ఇక నన్ను తిట్టే  తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్లో మంత్రి జవహర్ గారు కూడా ఒకరు, మంత్రి జవహర్‌గారు తిట్టే బదులు ముఖ్యమంత్రి గారు నన్ను తిట్టొచ్చు కదా, వాళ్లబ్బాయి లోకేశ్ తిట్టొచ్చు కదా, దేవినేని ఉమగారు తిట్టొచ్చు కదా? తిట్టరు.. వాళ్లెవ్వరూ నన్ను తిట్టరు.. జవహర్ గారితో తిట్టిస్తారు. మరి, దానర్థం ఏంటి? నువ్వు (పవన్) ఎస్సీ కులానికి వ్యతిరేకమని చెప్పడానికా? కులాల మధ్య చిచ్చు పెట్టడానికా? నేను ఎవరినైనా కులాలుగా చూడను. ప్రజలను రిప్రజెంట్ చేసే ప్రజాప్రతినిధులుగానే వారిని చూస్తాను, వారు ఏ కులమైనప్పటికీ..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

 

- Advertisement -