21.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home క్రీడలు కబడ్డీ ప్రో కబడ్డీ లీగ్‌: బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్‌.., మరో మ్యాచ్ డ్రా…

ప్రో కబడ్డీ లీగ్‌: బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్‌.., మరో మ్యాచ్ డ్రా…

Telugu Titans
- Advertisement -

Telugu Titans

చెన్నై: ప్రో కబడ్డీ లీగ్‌లో తొలి విజయం సాధించడం ద్వారా ఈ సీజన్‌ను తెలుగు టైటాన్స్‌ ఘనంగా ప్రారంభించింది. మంగళవారం తమిళ్‌ తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 33-28 తేడాతో తెలుగు టైటాన్స్‌ విజయం అందుకుంది. టైటాన్స్‌ నుంచి రాహుల్‌ చౌదరి, తమిళ్‌ తలైవాస్‌ నుంచి అజయ్‌ ఠాకూర్‌ ఇధ్దరు చెరో తొమ్మిదేసి రైడ్‌ పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచారు.

ఆరంభంలో తమిళ్‌ తలైవాస్‌ ఎంతో దూకుడు కనబరిచి మ్యాచ్ లో పైచేయి సాధించింది. అయితే తొలి అర్ధభాగం చివరి ఐదు నిమిషాల్లో 10-9తో ఆధిక్యం సాధించిన టైటాన్స్‌ ఆ తర్వాత తమిళ్‌ తలైవాస్‌ను ఏ దశలోనూ కోలుకోనీయలేదు. అదే జోరుతో అర్ధ భాగాన్ని 17-11 తేడాతో ముగించింది. ఆ తర్వాత కూడా టైటాన్స్‌కు ఎలాంటి పోటీ ఎదురుకాకపోవడంతో చకచకా పాయింట్లను పెంచుకుంటూ వెళ్లింది.

పటిష్ఠమైన డిఫెన్స్‌ పాటు అద్భుతమైన రైడింగ్‌తో సంపూర్ణ ఆధిక్యం చూపడంతో తమిళ్‌ తలైవాస్‌పై తెలుగు టైటాన్స్‌ తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన విజయం సాధించింది.

నువ్వా-నేనా అన్నట్లు…

గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌, దబాంగ్‌ ఢిల్లీ మధ్య మ్యాచ్‌ కూడా అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడడంతో మ్యాచ్‌ 32-32 స్కోరుతో చివరకు డ్రాగా ముగిసింది. ఢిల్లీ జట్టు నుంచి రంజిత్‌ 10 రైడ్‌ పాయింట్లు సాధించాడు.

తొలి అర్ధభాగంలో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ 17-12 స్కోరుతో స్పష్టమైన ఆధిక్యం సాధించినా చివరలో మాత్రం తడబడింది. 36వ నిమిషంలో ఇరు జట్ల స్కోరు 29-29తో సమమైంది. కానీ ఆ మరు నిమిషంలోనే రోహిత్‌ గులియా పాయింట్‌ తేవడంతో గుజరాత్‌ స్కోరు 30కి వెళ్లింది. ఆ తర్వాత గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌, దబాంగ్‌ ఢిల్లీ జట్లు.. నువ్వా-నేనా  అన్నట్టు ఆడి చివరికి మ్యాచ్‌ను డ్రాగా ముగించాయి.

- Advertisement -

1 COMMENT