ప్రో కబడ్డీ లీగ్‌ 2018: పుణేరి పల్టన్‌కి ఆరో విజయం, మరో మ్యాచ్‌లో.. గెలిచిన బెంగళూరు బుల్స్

bengaluru
- Advertisement -

bengaluru

పాట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌లో పుణేరి పల్టన్‌ ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జోన్‌ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన అత్యంత ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 31–27 స్కోరుతో దబాంగ్‌ ఢిల్లీపై విజయం సాధించింది. పుణేరి పల్టన్ తరఫున జీబీ మోరె 5 పాయింట్లు, దీపక్‌ దహియా 4  రైడ్‌ పాయింట్లతో తమ సత్తా చాటారు.  అలాగే ట్యాక్లింగ్‌లో సందీప్‌ నర్వాల్‌ కూడా 4 పాయింట్లతో ఆకట్టుకున్నాడు.

ఇరు జట్లు.. నువ్వా.. నేనా అనే రీతిలో సాగిన మ్యాచ్‌లో చివరికంటా ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. ఓ దశలో 8–10, 9–13తో వెనుకబడిన పుణేరి పల్టన్‌.. మోనూ గోయత్ ‘సూపర్‌ రైడ్‌’తో చెలరేగడంతో 13–13తో స్కోరును సమం చేసింది. ఇక అక్కడి నుంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ చివరకు మ్యాచ్‌ను తన సొంతం చేసుకుంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ 2018లో  భాగంగా బుధవారం  జరిగిన మరో మ్యాచ్‌లో.. పాట్నా పరేట్స్‌పై  41- 43 స్కోరుతో బెంగళూరు బుల్స్‌ గెలుపొందింది.

ప్రొ కబడ్డీ లీగ్‌లో నేటి మ్యాచ్‌లు…

బెంగాల్‌ వారియర్స్‌ x పాట్నా పైరేట్స్

యూపీ యోధా x తమిళ్‌ తలైవాస్‌

- Advertisement -