వైజాగ్ దాడి ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించిన జగన్‌

ap-high-court
- Advertisement -

attack to ys jaganహైదరాబాద్‌: విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దాడి ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఆయన బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

చదవండి: షాకింగ్: వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం, కోడి పందేలకు వాడే కత్తితో దాడి…

ఈ పిటిషన్‌లో ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేని స్వతంత్ర సంస్థలతో ఈ కేసును దర్యాప్తు చేయించాలని జగన్‌ హైకోర్టు కోరారు. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు ప్రతిపక్ష నేత జగన్‌ గత గురువారం విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కూర్చొని ఉండగా.. సెల్ఫీ నెపంతో వచ్చిన శ్రీనివాసరావు అనే యువకుడు ఆయనపై కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

అయితే, విశాఖపట్నంలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న జగన్‌.. సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకోవడం, ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడం.. తదితర అంశాలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పలు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. మరోవైపు దాడి ఘటన జరిగిన వెంటనే నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగో రోజూ విచారణ కొనసాగిస్తున్నారు.

చదవండి: జగన్‌పై దాడి: వంట గదిలో ఉండాల్సిన శ్రీనివాసరావు.. సర్వీస్ బోయ్‌గా ఎలా?

చదవండి: వైఎస్ జగన్‌పై దాడి: నిందితుడు శ్రీనివాసరావుకు అస్వస్థత

- Advertisement -